న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, ఐపీల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథి విరాట్ కోహ్లీ ఇటీవల ఐటైమ్స్ ఆన్ లైన్ పోల్‌లో మోస్ట్ డిజరబుల్ మేన్‌గా నిలిచాడు. ఆయన నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా తన ప్రియురాలు అనుష్క శర్మ గురించి స్పందించాడు. ఆమెలో నచ్చేవి ఏమిటో, ఆమెను ఎందుకు ప్రేమిస్తున్నానో తెలిపాడు.
సహచరులు సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలను దాటి అతను తొలి స్థానం కైవసం చేసుకున్నాడు. ఈ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ పలు అంశాలపై స్పందించాడు.
మీరు ఎందుకు ఎంపికయ్యారు అనుకంటున్నారని అడిగితే, తాను సూటిగా మాట్లాడే వ్యక్తినని, తాను వాస్తవాలను వక్రీకరించనని, నిజాన్ని దాచనని చెప్పాడు.

నా వరకు నా ప్రియురాలు అనుష్క శర్మ ప్రపంచంలోనే మోస్ట్ డిజరబుల్ మహిళ అని కితాబిచ్చాడు. ఆమె లవ్లీగా ఉంటుందని, సాధారణంగా ఉండేందుకు ఇష్టపడుతుందని, అలాగే తనలాగే నిజాయితీ కలిగిన వ్యక్తి అని చెప్పాడు. అందుకే తాను ఆమెను ఇష్టపడుతున్నానని చెప్పాడు.
ఆమ్మ గురించి మాట్లాడుతూ... తాను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడం మొదలెట్టిన సమయంలోనే నాన్నను కోల్పోయానని, అప్పటికి భారత జట్టులోకి రాలేదని, తనకు అన్న, అక్క ఉన్నారని, మా అమ్మ చాలా సంప్రదాయస్తురాలని, తాను చూసిన మహిళల్లో మానసికంగా చాలా దృఢంగా కనిపించింది మా అమ్మే అన్నాడు.
నాన్న పోయిన తర్వాత కుటుంబాన్ని ఒక్క తాటిపై నడిపించిందని, ఎన్నో క్లిష్టమెన పరిస్థితులను ఆమె చాలా ప్రశాంతతో ఎదుర్కోవడం చూశానని, అందుకే అమ్మపై అంత ప్రేమ, గౌరవం ఉన్నాయన్నాడు.