Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్, బుమ్రాలను ఎలా సెలక్ట్ చేశారు: డుప్లెసిస్

Virat Kohli Reveals The Reason For Picking Rohit Sharma Over Ajinkya Rahane

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ తొలి టెస్టు పరాజయం పొందడంతో జట్టుపై, ఆటగాళ్ల ఎంపికపై విశ్లేషణ మొదలైంది. ఇందులో రోహిత్ శర్మ ఎంపికే చర్చనీయాంశమైంది. గతంలో సఫారీ గడ్డపై రాణించిన అజింక్య రహానేను పక్కనబెట్టి స్థానంలో రోహిత్‌ శర్మను తీసుకోవటం అన్న అంశం మీదే అవి ఎక్కువగా వినిపిస్తున్నాయి.

పేస్‌ మైదానంపై చెలరేగిపోయే రోహిత్‌ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి అతి కష్టం మీద 21 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ను అనవసరంగా ఎంపిక చేశారంటూ సెలక్షన్‌ కమిటీ నిర్ణయాన్ని సీనియర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

అయితే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం ఆ నిర్ణయం సరైందేనని వ్యాఖ్యానించారు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. రోహిత్‌ను ఎంపిక చేయటానికి కారణాలు వివరించాడు.

'తాను ఆడిన చివరి మూడు టెస్టు మ్యాచ్‌లలో రోహిత్‌ బాగానే స్కోర్‌ చేశాడు. శ్రీలంక సిరీస్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ప్రస్తుత ఫామ్‌ ఆధారంగానే మేం అతన్ని తుది జట్టులోకి తీసుకున్నాం. ఓ జట్టుకు అదే కీలకమైన విషయం. విమర్శలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జట్టు బాగా ప్రాక్టీస్‌ చేసింది. కానీ, విఫలం అయ్యాం' అని కోహ్లి వివరించాడు.

ఇదే విషయంపై డుప్లెసిస్ స్పందించాడు. 'మేము ఆశ్యర్య పోయాం. అస్సలు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్‌లో ఆడతారనే విషయాన్ని అనుకోనే లేదు. అతను వన్డే మ్యాచ్ లకు ఆడగలడు. కానీ, టెస్ట్ మ్యాచ్‌లకు ఇంకా మంచి ఆటగాళ్లుండగా అతన్నే ఎందుకు తీసుకున్నారో అని డుప్లెసిస్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 9:58 [IST]
Other articles published on Jan 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+