Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యం.. తన టార్గెట్ రివీల్ చేసిన కింగ్ కోహ్లీ! (వీడియో)

Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మంగళవారం కీలక ప్రకటన చేశాడు. 2027 వనేడే ప్రపంచ కప్ ఆడటం గురించి కీలక అప్‌డేట్ ఇచ్చాడు. తన తదుపరి ప్రధాన కెరీర్ గోల్ గురించి తెలిపాడు. ప్రపంచ కప్ గెలవడమే తన ముందున్న టార్గెట్ అని ఒక షో సందర్బంగా విరాట్ కోహ్లీ తన లక్ష్యాన్ని రివీల్ చేశాడు. తదుపరి వన్డే ప్రపంచకప్ గెలవాలని తాను చూస్తున్నానని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ ప్రకటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రైవేట్ ఈవెంట్ మీ తదపరి లక్ష్యం ఏంటి.. అసలేం చేయబోతున్నారు.. పెద్దగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా.. అని అడిగిన ప్రశ్నకు విరాట్ కోహ్లీ స్పందించాడు. వన్డే వరల్డ్ కప్ తదుపరి ఎడిషన్ 2027లో దక్షిణాఫ్రికాలో జరగనుంది.

2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకోవడానికి భారత్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఫైనల్ లో ఓటమిని చవిచూసి రన్నరప్ గా మిగిలిపోయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ లో ఓటమి పాలైంది. ఈ ఎడిషన్ లో 11 మ్యాచ్ లలో 95.62 సగటుతో రికార్డు స్థాయిలో 765 పరుగులు సాధించినందుకు కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికయ్యాడు. కోహ్లీ మూడు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలు చేశాడు.

Virat Kohli Reveals Target for 2027 World Cup Victory

అయితే ప్రతిష్ఠాత్మక గౌరవం లభించినప్పటికీ ఫైనల్ లో భారత్ ఓడిపోయిన తర్వాత కోహ్లీ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రదర్శన సమయంలో కూడా మాట్లాడలేదు. అప్పటి నుంచి సీనియర్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను తదుపరి ప్రపంచ కప్ వరకు వన్డేలు ఆడటం కొనసాగిస్తారా అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం 2027 ప్రపంచకప్ వరకు విరాట్, రోహిత్ లు తమ కెరీర్ ను కొనసాగించడానికి దాదాపు మార్గం సుగమం చేసింది. టోర్నమెంట్ లో కోహ్లీ మరోసారి మంచి ఫామ్ లో కనిపించాడు. పాకిస్థాన్, ఆస్ట్రేలియాలపై మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. రోహిత్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Tuesday, April 1, 2025, 13:58 [IST]
Other articles published on Apr 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+