Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ పేరును ధోనీనే ఫేమస్‌ చేశాడు: కోహ్లీ

Virat Kohli reveals story behind nickname Chiku and how MS Dhoni made it famous
Virat Kohli Reveals The Secret Behind His Nickname 'Cheeku'

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ముద్దుగా 'చీకూ' అంటార‌నే విష‌యం ప్రతిఒక్కరికి తెలిసిందే. అయితే ఈ పేరు ఫేమస్‌ కావ‌డానికి మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీనే కార‌ణ‌మ‌ని కోహ్లీ పేర్కొన్నాడు. వికెట్ల వెనుక ఉన్న‌ప్పుడు ధోనీ త‌ర‌చుగా 'చీకూ' అని పిలువ‌డంతోనే త‌న ముద్దుపేరు అందరికి తెలిసిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. తనకు ఆ పేరు రంజీట్రోఫీ ఆడే రోజుల్లో వచ్చిందని, అప్పటి కోచ్‌ ఒకరు తన బుగ్గలను చూసి అలా చికు అనే ముద్దుపేరు పెట్టాడని తెలిపాడు.

రంజీ కోచ్‌ ముద్దుపేరు పెట్టారు:

రంజీ కోచ్‌ ముద్దుపేరు పెట్టారు:

గురువారం రాత్రి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో కోహ్లీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి. క్రమంలోనే తన ముద్దు పేరు ఎలా ఫేమస్‌ అయిందో కోహ్లీ చెప్పాడు. 'రంజీట్రోఫీ ఆడే రోజుల్లో అక్కడి కోచ్‌ నాకు 'చీకూ' అనే ముద్దుపేరు పెట్టారు. అప్పట్లో నాకు పెద్ద బుగ్గలు ఉండేవి. 2007లో జుట్టు ఊడిపోతుంటే చిన్నగా హెయిర్‌కట్‌ చేయించుకున్నా. దాంతో నా బుగ్గలు, చెవులు పెద్దగా కనిపించేవి. కార్టూన్‌లోని ఓ కుందేలు పాత్ర పేరు చంపక్‌. దాంతో నాకు ఆ పేరు వచ్చింది' అని కోహ్లీ తెలిపాడు.

మహీనే ఫేమస్‌ చేశాడు:

మహీనే ఫేమస్‌ చేశాడు:

అయితే చీకూ అనే పేరును మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఫేమస్‌ చేశాడని కోహ్లీ చెప్పాడు. 'నా ముద్దుపేరు అంద‌రికీ తెలిసేలా చేసింది ధోనీనే. వికెట్ల వెనుక నుంచి మ‌హీ త‌రచూ న‌న్ను చీకూ, చీకూ అని పిలువ‌డం.. అది స్టంప్స్ మైక్‌లో రికార్డ‌వ‌డంతో అంద‌రికీ తెలిసిపోయింది' అని కోహ్లీ చెప్పాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్‌లలో పరుగుల ప్రవాహం పారించడంతో.. అతన్ని 'రికార్డుల రారాజు', 'పరుగుల యంత్రం' అని కూడా పిలుస్తారు.

 ధోనీతో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా:

ధోనీతో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా:

మైదానంలో ఎవరితో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతావు? అని కోహ్లీని పీటర్సన్ ప్రశ్నించగా.. ధోనీ, డివిలియర్స్ అని సమాధానం ఇచ్చాడు. ఆటలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నా మిత్రులపై మాత్రం ఆగ్రహం చూపించలేనని అన్నాడు. 'నాతో పోటీపడుతూ వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తే వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తాను. టీమిండియా తరఫున ఆడే సమయంలో ధోనీ.. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడేటప్పుడు డివిలియర్స్ నా జాబితాలో ఉన్నారు. ఈ ఇద్దరితో కలిసి బ్యాటింగ్ చేసే సమయంలో వికెట్ల మధ్య పరుగు కోసం ప్రత్యేకంగా పిలుపులు ఉండవు. ఒకరినొకరు చూసుకుని పరుగెత్తేస్తామంతే' అని కోహ్లీ తెలిపాడు.

Story first published: Saturday, April 4, 2020, 12:12 [IST]
Other articles published on Apr 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+