పాండ్యాకు ప్రమోషన్, ధోనికి డిమోషన్‌పై ఫ్యాన్స్ మండిపాటు
హైదరాబాద్: యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా అటు బ్యాటుతోనూ, బంతితోనూ రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో 72 బంతుల్లోనే 78 పరుగులు చేసిన పాండ్యా, మనీష్ పాండేతో కలిసి ఐదో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 13 బంతులు ఉండగానే టీమిండియా చేధించింది. మూడో వన్డేలో పాండ్యా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ స్థానానికి తగినట్లుగా ఆడిన పాండ్యా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టడంతో పాటు భారత జట్టులో సూపర్ స్టార్‌గా ఎదిగాడు.
ఇదే విషయాన్ని కెప్టెన్ కోహ్లీ సైతం వెల్లడించాడు. మూడో వన్డే ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా ఆటతీరుకు ముచ్చట పడిన కోహ్లీ ఆల్‌రౌండర్‌గా పాండ్యా జట్టుకు గొప్ప ఆస్తి అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

పాండ్యాకు ప్రమోషన్
అంతేకాదు పాండ్యాను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలనే ఆలోచన కోచ్ రవిశాస్త్రిదేనని చెప్పాడు. స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగాలంటే పాండ్య ముందుగా బ్యాటింగ్ చేయడమే మంచిదని కోచ్ రవిశాస్త్రి భావించాడని కోహ్లీ తెలిపాడు. దీంతో శాస్త్రి ఆలోచనకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని కోహ్లీ చెప్పాడు.

నమ్మకాన్ని నిజం పాండ్యా
అలా పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చి కోచ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడని, మా జట్టులో పాండ్యా సూపర్ స్టార్ అని కోహ్లీ కొనియాడాడు. గత ఐదారేళ్లుగా ఇలాంటి ఆటగాడి కోసమే ఎదురు చూస్తున్నామని కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పడం విశేషం. అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో ఆ స్థానంలో మనీష్ పాండే ఆడుతున్నాడు.

ఏడోస్థానంలో క్రీజులోకి వచ్చిన ధోని
అయితే పాండే విఫలం కావడంతో ఏడో స్థానంలో ఆడుతున్న పాండ్యాను నాలుగో స్థానానికి ప్రమోట్ చేసి.. మనీష్ పాండేను ధోని ఆడుతున్న ఆరో స్థానంలో పంపారు. దీంతో మాజీ కెప్టెన్ ధోని ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ధోని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
రవిశాస్త్రి ఆలోచనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భువనేశ్వర్ కుమార్ తర్వాత ధోనిని బ్యాటింగ్‌కు పంపితే సరిపోయేది కదా? అని విమర్శిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications