Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ విష‌యంలో క్రెడిట్ మొత్తం అనుష్కదే: కోహ్లీ

Virat Kohli reveals influence of Anushka Sharma on his life

ఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ నుంచి ఎంతో నేర్చుకున్నాన‌ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ముఖ్యంగా ఓపిక విష‌యంలో మాత్రం క్రెడిట్ మొత్తం భార్య ‌అనుష్కకే ద‌క్కుతుంద‌ని కోహ్లీ పేర్కొన్నాడు. గ‌తంలో తాను చాలా దూకుడుగా ఉండేవాడిన‌ని, అనుష్క ప‌రిచ‌యం త‌న‌లో చాలా మార్పులు తీసుకొచ్చింద‌ని విరాట్ చెప్పుకొచ్చాడు. మంగళవారం విద్యార్థులతో ఆన్‌లైన్ సెషన్‌లో పాల్గొన్న కోహ్లీ.. వారితో పలు విషయాలు పంచుకున్నాడు.

అనుష్క ప‌రిచ‌యం చాలా మార్పుల‌కు కార‌ణ‌మైంది:

అనుష్క ప‌రిచ‌యం చాలా మార్పుల‌కు కార‌ణ‌మైంది:

ఆన్‌లైన్ సెషన్‌లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'నిజాయతీగా చెప్పాలంటే అనుష్క శర్మతో ప‌రిచ‌యం నాలో చాలా మార్పుల‌కు కార‌ణ‌మైంది. గ‌తంలో నేను ప్ర‌తీ చిన్న విష‌యానికి కొప్ప‌డేవాడిని. తీవ్ర అసహనానికి గురయ్యేవాడిని. ఇప్పుడు ఆ ధోర‌ణి మారింది. అనుష్క నాలో శాంత‌న్ని నింపింద‌నుకుంటా. అనుష్క వ్యక్తిత్వం, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆమె ప్రశాంతంగా ఉండడం నిజంగా నన్ను ప్రేరేపించింది' అని తెలిపాడు. విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు.

 అనుష్కను చూసే నేర్చుకున్నా:

అనుష్కను చూసే నేర్చుకున్నా:

'కఠిన సమయాల్లో ఉన్నప్పుడు మీరు మీ అహాన్ని మింగేయాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దైర్యంగా ఉండి మన మార్గం వెతుక్కోవాలి. ఇవన్నీ నేను అనుష్క శ‌ర్మను చూసే నేర్చుకున్నా. కొన్నిసార్లు మీరు ఒక టెస్ట్ మ్యాచ్‌లో 20 పరుగుల కోసం రెండు గంటలు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు అలా చేయాలని జట్టు కోరుకుంటుంది కాబట్టి అలా చేయగలగాలి' అని విరాట్ కోహ్లీ విద్యార్థులతో చెప్పాడు. 2017, డిసెంబర్ 11 విరాట్-అనుష్క ఇటలీలో వివాహం చేసుకున్నారు.

 ఏది అనుకూలంగా జరగట్లేదని భావించా:

ఏది అనుకూలంగా జరగట్లేదని భావించా:

జీవితంలో నిస్సహాయంగా భావించిన క్షణం గురించి విరాట్ కోహ్లీని సెషనలో అడగ్గా... తొలి సారి స్టేట్ టీమ్ సెలెక్షన్స్‌లో పాల్గొంటే తనకు ఎదురు దెబ్బ తగిలిందని, ఆ ట్రయల్స్‌లో రిజెక్ట్ చేశారని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. 'రాష్ట్ర జట్టుకు ఎంపిక కాని సమయంలో నాకు ఏది అనుకూలంగా జరగట్లేదని భావించా. ఆ రోజు రాత్రంతా ఏడ్చాను. ఎందుకు ఎంపిక కాలేదని మా కోచ్‌ను ప్రశ్నించాను' అని కోహ్లీ వెల్లడించాడు.

మనుషుల్లో మానవత్వం ఎంతో పెరగింది:

మనుషుల్లో మానవత్వం ఎంతో పెరగింది:

కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభంతో మనుషుల్లో మానవత్వం ఎంతో పెరగిందని, ఇతరుల పట్ల జాలి, కరుణతో ఉంటున్నామని ‌ కోహ్లీ అన్నాడు. 'ప్రస్తుత సంక్షోభంలోనూ ఓ ప్రయోజనం ఉంది. కరోనాతో సమాజమంతా ఇతరుల పట్ల జాలి, కరుణతో ఉంటుంది. మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞత భావాన్ని చూపిస్తున్నాం. సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత కూడా దీన్ని ఇలానే కొనసాగిస్తామని ఆశిస్తున్నా' అని కోహ్లీ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, April 22, 2020, 14:44 [IST]
Other articles published on Apr 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+