Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Vs Australia: వన్డే సిరిస్‌కి జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి!

India vs Australia 2019:Virat Kohli Return,Dhawan-Rohit Sharma Rested ? India's Probable ODI Squad
Virat Kohli to return, Rohit-Dhawan rested? Indias probable ODI squad for five-match Australia series

హైదరాబాద్: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న సుదీర్ఘ పర్యటన కోసం వన్డే జట్టుని ప్రకటించేందుకు భారత సెలక్టర్లు పెద్ద కసరత్తే చేస్తున్నారు. వరల్డ్‌కప్‌ ముందు టీమిండియా ఆడే చివరి వన్డే సిరిస్ కావడంతో జట్టు ఎంపిక ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఫిబ్రవరి 24 నుంచి భారత్ గడ్డపై ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. వరల్డ్ కప్ కోసం గతేడాది కాలంగా రొటేషన్ పద్ధతిలో జట్టులోని సీనియర్ ఆటగాళ్లకి విశ్రాంతినిస్తున్న సెలక్టర్లు.. ఆసీస్‌తో జరిగే సిరిస్‌లో‌ఎవరికి విశ్రాంతిస్తారు? ఎవరిని పరీక్షిస్తారు? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఆసీస్‌తో ఐదు వన్డేల సిరిస్

ఆసీస్‌తో ఐదు వన్డేల సిరిస్

ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరిస్ ముగిసే నాటికి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో ఆడే జట్టుపై పూర్తి స్పష్టత రానుందని ఇటీవలే ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు తమ వరల్డ్‌కప్ తుది జట్టు ఎంపిక ప్రణాళికల్లో విజయ్ శంకర్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, ఖలీల్ అహ్మద్, రహానేలు ఉన్నారని చెప్పడంతో వారంతా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా

మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా

ఈ ఏడాది మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా టీమిండియా జూన్ 5వ తేదీన సఫారీలతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేఫథ్యంలో రొటేషన్ పద్ధతిలో ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ఈసారి రోహిత్ శర్మ, భువనేశ్వర్‌కి విశ్రాంతినివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఓపెనర్‌గా కేఎల్ రాహుల్

ఓపెనర్‌గా కేఎల్ రాహుల్

దీంతో కేఎల్ రాహుల్‌కి ఓపెనర్‌గా అవకాశం దక్కనుంది. ఇక, మిడిలార్డర్‌ కోసం అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఆడితే.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో అంబటి రాయుడు లేదా రిషబ్ పంత్‌ని ఆడించాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది.

కుల్దీప్, చాహల్‌ని కొనసాగించాలా?

కుల్దీప్, చాహల్‌ని కొనసాగించాలా?

ఐదో స్థానం కోసం విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్ పోటీపడుతుండగా.... ఆరో స్థానంలో ధోని, ఏడోస్థానంలో హార్దిక్ పాండ్యా ఆడనున్నారు. ఇక, బౌలర్లలో ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్‌కి జస్ప్రీత్‌ బుమ్రా పునరాగమనం చేస్తుండగా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్‌కి మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్, చాహల్‌ని కొనసాగించాలా? లేక ఇద్దరిలో ఒకరికి విశ్రాంతినిచ్చి జడేజాకి అవకాశమివ్వాలా అని సెలక్టర్లు తర్జన భర్జన పడుతున్నారు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్‌కు భారత జట్టు (అంచనా):

ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్‌కు భారత జట్టు (అంచనా):

శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ధోని, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్

Story first published: Thursday, February 14, 2019, 16:18 [IST]
Other articles published on Feb 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+