Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ సత్తా చూపించి కెరీర్‌ను గొప్పగా ముగించాలి: మాజీ క్రికెటర్

Mohammad Kaif: కొన్ని రోజుల క్రితం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని విరాట్ కోహ్లీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. విరాట్ కోహ్లీ బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. ఈ విషయంలో ఫ్యాన్స్‌తో పాటు క్రీడా లోకం ఆశ్చర్యానికి గురైంది. విరాట్ రిటైర్మెంట్ కావద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అభిమానుల నుంచి అనుభవజ్ఞులైన క్రికెటర్ల వరకు విరాట్ కోహ్లీని ఒప్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా విరాట్ రిటైర్మెంట్ తీసుకోవద్దని సలహా ఇచ్చాడు. దీనితో పాటు విరాట్ ఇప్పుడు టెస్ట్ నుంచి ఎందుకు రిటైర్ కాకూడదో కూడా మహ్మద్ కైఫ్ చెప్పాడు.

కైఫ్‌తో విరాట్ ఏకీభవిస్తాడా?
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో క్రికెట్ వర్గాలు ఆయనను అలా చేయవద్దని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కూడా కోహ్లీని రిటైర్ కావద్దని విజ్ఞప్తి చేశాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ గురించి బీసీసీఐకి తెలియజేశాడు. ఈ వార్త వచ్చినప్పటి నుంచి ఇది ప్రతిచోటా చర్చించబడుతోంది. జూన్ 20న ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాలని కోహ్లీని కోరుతూ మహ్మద్ కైఫ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశాడు.

Virat Kohli Retirement Talk Mohammad Kaif Urges Him to Finish Strong

విరాట్ కోహ్లీకి మహ్మద్ కైఫ్ ప్రత్యేక సందేశం
మహ్మద్ కైఫ్ సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ కోసం ఒక ప్రత్యేక సందేశం ఇచ్చాడు. విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ వెళ్లి తన సత్తా చూపించి కెరీర్‌ను గొప్పగా ముగించాలని ఆయన అన్నారు. టీ20 ప్రపంచ కప్ లాంటి గొప్ప విజయంతో విరాట్ కోహ్లీ తన కెరీర్‌ను ముగించాలని కూడా కైఫ్ అన్నాడు. భారత సింహం విరాట్ కోహ్లీ ఇప్పుడు విశ్రాంతి తీసుకునే మూడ్‌లో ఉన్నాడని కైఫ్ పేర్కొన్నాడు. కోహ్లీ మనసు రిటైర్మెంట్ వైపు పయనిస్తోందని.. ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ తన సత్తాను నిరూపించుకుని.. కెరీర్‌ను గొప్పగా ముగించాలని తాను అనుకుంటున్నానని అన్నాడు.

ఇప్పటికే విరాట్‌ను అభ్యర్థించిన దిగ్గజ క్రికెటర్లు
మహ్మద్ కైఫ్ కంటే ముందు బ్రియాన్ లార్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ వింటి దిగ్గజాలు కూడా కోహ్లీని రిటైర్ కావద్దని కోరారు. ఇంగ్లాండ్ సిరీస్‌లో కోహ్లీ అనుభవం భారత్‌కు అవసరమని నవజ్యోత్ సింగ్ సిద్దూ అన్నారు. బ్రియాన్ లారా కూడా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్‌కు విరాట్ అవసరం చాలా ఉందని.. కోహ్లీ రిటైర్ కాబోడని లారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌లో మిగిలిన కాలంలో 60 కంటే ఎక్కువ సగటును కలిగి ఉంటాడని బ్రియాన్ లారా అన్నారు.

2011లో అరంగేట్రం
విరాట్ కోహ్లీ 2011లో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు విరాట్ కోహ్లీ బలమైన స్తంభంగా ఉన్నాడు. భారత క్రికెట్ జట్టులో కోహ్లీ ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ అభిమానులు, చాలా మంది మాజీ క్రికెటర్లు అతను టెస్ట్ క్రికెట్ ఆడటం కొనసాగించాలని కోరుకుంటున్నారు. కోహ్లీ తమ మాట విని ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆడతాడని అందరూ ఆశిస్తున్నారు. ఇది భారత జట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.

Story first published: Monday, May 12, 2025, 9:23 [IST]
Other articles published on May 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+