
హైదరాబాద్: ఊహించినట్టే జరిగింది. టెస్టు సిరిస్ అనంతరం లంకతో జరగనున్న వన్డే సిరిస్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. దీంతో కోహ్లీ స్థానంకో కెప్టెన్‌గా రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలను నిర్వహిస్తాడు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ విశ్రాంతి కోరడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకతో వన్డే, టీ20లకు కోహ్లీ దూరమవుతాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే వన్డేలకు మాత్రమే అతనికి విశ్రాంతి కల్పించింది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరిస్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు పెళ్లి కారణంగా టెస్టు సిరిస్‌కు దూరమైన పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా సెలక్టర్లు ప్రకటించిన 15 మంది జట్టు సభ్యుల్లో చోటు దక్కించుకున్నాడు.

వన్డే సిరిస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఒకే ఒక్క మార్పు చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా టూర్‌కు జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో పేసర్ శార్దుల్ కౌల్‌కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో శార్దుల్ కౌల్ చివరగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు.
డిసెంబర్ 10 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 20న టీ20 సిరీస్ మొదలవుతుంది. అయితే వన్డే సిరీస్‌కు కోహ్లికి రెస్ట్ ఇచ్చినా.. టీ20 సిరీస్‌కు అతడు తిరిగొచ్చే అవకాశం ఉందని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పడం విశేషం. కాగా, సోదరి పెళ్లి కారణంగా రెండో టెస్టుకు దూరమైన ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి మూడో టెస్టు కోసం జట్టులోకి వచ్చాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య డిసెంబర్ 2 నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
వన్డే జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, రహానె, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ కౌల్.
టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, పుజారా, రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, షమి, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, విజయ్ శంకర్.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.