Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాతో టీ20 సిరిస్‌కు కోహ్లీకి విశ్రాంతి: సంజూ శాంసన్, దూబేలకు సెలక్టర్ల పిలుపు

 Virat Kohli rested for T20Is against Bangladesh, Sanju Samson, Dube get call; Chahal returns

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో టీ20 సిరిస్‌ నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. నవంబర్ 3 నుంచి ఆరంభమయ్యే ఈ టీ20 సిరిస్‌కు కోహ్లీ స్థానంలో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది.

టీ20 సిరిస్ అనంతరం రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు తిరిగి కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు జట్టుని ఎంపిక చేసేందుకు గాను ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం సమావేశమైంది. వరల్డ్‌కప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే.

కోహ్లీకి విశ్రాంతి

కోహ్లీకి విశ్రాంతి

కోహ్లీ పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని అతడికి విశ్రాంతినిచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో చివరి రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్‌లో కోహ్లి చివరగా విశ్రాంతి తీసుకున్నాడు. కోహ్లీ స్థానంలో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

సంజూ శాంసన్, దుబేలకు పిలుపు

సంజూ శాంసన్, దుబేలకు పిలుపు

విజయ్‌ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో రాణించిన కేరళ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌కు సెలక్టర్లు మళ్లీ చోటు కల్పించారు. భారత్ తరుపున సంజు శాంసన్ ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు. వరల్డ్‌కప్ అనంతరం రెండు నెలలు పాటు విరామం తీసుకున్న ధోనీని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. మరోవైపు విజయ్‌ హజారే ట్రోఫీలో సెంచరీతో వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్ శివమ్ దూబే కూడా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరిస్‌కు దూరమైన యజువేంద్ర చాహల్ కూడా తిరిగి చోటు దక్కించుకున్నాడు.

బంగ్లా సిరిస్‌కు భారత టీ20 జట్టు:

బంగ్లా సిరిస్‌కు భారత టీ20 జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌పంత్‌ (కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, కృనాల్‌ పాండ్య, యుజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, శివమ్‌ దూబే, శార్దూల్‌ ఠాకూర్‌

బంగ్లా సిరిస్‌కు భారత టెస్టు జట్టు:

బంగ్లా సిరిస్‌కు భారత టెస్టు జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా (కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, రిషభ్‌పంత్‌

Story first published: Thursday, October 24, 2019, 18:20 [IST]
Other articles published on Oct 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+