Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంకతో టి20: కోహ్లీకి విశ్రాంతి, 'సచిన్ వల్లే ఎదిగాను'

ముంబై: శ్రీలంకతో జరగనున్న ట్వంటీ 20 సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేశారు. శ్రీలంక పర్యటనకు విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. పవన్ నేగీకి పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ 20లో కోహ్లీ సత్తా చాటిన విషయం తెలిసిందే.

కాగా, శ్రీలంకతో జరగనున్న ట్వంటీ 20 సిరీస్ కోసం జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, మనీష్ పాండే, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, హర్బజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, పవన్ నేగిలకు చోటు దక్కింది.

సచిన్ సలహాల వల్లే ఎదిగా: కోహ్లీ

Virat Kohli rested for Sri Lanka T20s, Pawan Negi called up

తాను క్రికెటర్‌గా ఆరంగేట్రం చేసిన తొలినాళ్లలో సచిన్ టెండుల్కర్ ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపకరించాయని టెస్ట్ కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. ఐసీసీ విడుదల చేసిన ట్వంటీ 20 ర్యాంకింగ్స్ జాబితాలో కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్‌తో పలు విషయాలు పంచుకున్నాడు.

నేను క్రికెట్‌ను కెరీర్‌గా మార్చుకోవడానికి సచిన్ కారణమని, అతని ఆటతో ప్రేరణ పొందానని చెప్పాడు. అతనితో డ్రెస్సింగ్ రూంను పంచుకునే అవకాశం దక్కినందుకు అదృష్టవంతుడినని చెప్పాడు. సచిన్ చెప్పిన చిన్న చిన్న సలహాలు తనకు ఉపయోగపడ్డాయన్నాడు.

అతని సలహాలతో తన ఆట మెరుగుపడుతూ వచ్చిందన్నాడు. క్రీజులో ఉన్న సమయంలో తన వద్దకు వచ్చి అనేక విషయాలను చెబుతుండే వాడన్నాడు. ఒక లెజెండ్ క్రికెటర్ ఇలా సలహాలు ఇవ్వడం అరుదైన విషయమన్నాడు. తాము ట్వంటీ 20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ లోను బాగానే రాణించామన్నాడు. అయితే ఆస్ట్రేలియా వన్డేల్లో తమ కంటే బాగా ఆడిందని చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+