బాల్ ట్యాంపరింగ్: కోహ్లీ ఏమన్నాడో తెలుసా?
మొహాలి: తనపై వచ్చిన బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం స్పందించాడు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్‌పై దృష్టి మళ్లించేందుకే ఇలాంటి అర్ధంలేని ఆరోపణలు తెరపైకి తెస్తున్నారని కోహ్లీ అన్నాడు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు శనివారం నుంచి మొహాలిలో జరగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'నాకు న్యూస్ పేపర్లు చదివే అలవాటులేదు. అందుకే నాకు దీని గురించి తెలియదు. రాజ్‌కోట్(తొలి) టెస్టులో నేను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డానని చెప్పడంతో ఆ విషయం తెలిసి మొదట నవ్వుకున్నా. ప్రస్తుతం హోరాహోరీగా సాగుతోన్న భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌పై దృష్టి మరల్చేందుకే ఇలాంటి కథనాల్ని పుట్టించారని అర్థం అవుతుంది' అని కోహ్లీ చెప్పాడు.

ఆశ్చర్యానికి గురి చేసింది
'ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా సిరిస్ నెగ్గడంతో అక్కడ కూడా ఇలానే జరిగింది. అయితే విశాఖ టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి పాలైన తర్వాత.. రాజ్‌కోట్(తొలి) టెస్టులో బాల్ ట్యాంపరింగ్ జరిగిందని కథనాలు రావడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది' అని కోహ్లీ తెలిపాడు. అయితే న్యూస్ పేపర్లో కథనం ఆధారంగా ఐసీసీ తనపై చర్యలకు ఉపక్రమించబోదని భావిస్తున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు.

బ్రిటిష్ జర్నలిస్టులు తట్టుకోలేకపోతున్నారు
ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరిస్‌లో భారత్ పైచేయి సాధించడాన్ని బ్రిటిష్ జర్నలిస్టులు తట్టుకోలేకపోతున్నారని కోహ్లీ పేర్కొన్నాడు. తాను తప్పు చేసినట్లైతే ఐసీసీ తనని సంప్రదించేదని కోహ్లీ తెలిపాడు. ఇది తప్పుడు ఆరోపణ అనే ఐసీసీ దీనిని తేలిగ్గా తీసుకుందని కోహ్లీ తోసిపుచ్చాడు.

తొలి టెస్టులో కోహ్లీ బాల్ ట్యాంపరింగ్
కాగా, నవంబర్ 9-13 వరకు రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ బ్రిటిష్ దినపత్రిక ‘ది డైలీ మెయిల్' ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కథనంపై టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేతో పాటు పలువురు మాజీలు ఖండించారు.

కోహ్లీపై ఐసీసీ చర్యలకు నో
నిజానికి కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడితే మ్యాచ్ ముగిసిన ఐదు రోజుల్లోపే అంపైర్లు లేదా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు ఫిర్యాదు చేయాల్సి ఉంది. అయితే అలా జరగలేదు. దీంతో కోహ్లీపై ఐసీసీ చర్యలకు దిగే అవకాశమే లేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications