IND vs PAK: రోహిత్ బదులుగా ఇషాన్ కిషన్‌ని ఆడిస్తే బాగుండేది.. రిపోర్టర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన కోహ్లీ!

దుబాయ్: విశ్వవేదికపై టీమిండియా తిరుగులేని రికార్డును పాకిస్థాన్‌ బద్దలు కొట్టింది. ఐసీసీ ప్రపంచకప్‌లలో భారత్‌ చేతిలో ఇప్పటివరకు 12 సార్లు ఓటమి పాలైన పాకిస్థాన్‌.. తొలిసారి విజయం సాధించింది. సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ మైదానంలో జరిగిన పోరులో అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్‌ 10 వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొందింది.

ఐసీసీ ప్రపంచకప్‌లలో భారత్‌పై పాకిస్థాన్‌కు ఇదే తొలి గెలుపు కాగా.. 10 వికెట్ల తేడాతో గెలవడం కూడా ఇదే మొదటిసారి. ఇక బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దారుణ ఓటమి తర్వాత జరిగిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రిపోర్టర్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.

తొలి బంతికే డకౌట్‌

తొలి బంతికే డకౌట్‌

హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియాకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్‌గా వెనుతిరిగాడు. పాక్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదీ వేసిన తొలి ఓవర్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న లోకేష్ రాహుల్.. ఒక పరుగు మాత్రమే తీశాడు. అనంతరం తాను ఎదుర్కొన్న తొలి బంతికే రోహిత్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ఐపీఎల్ 2021లో అదరగొట్టిన రోహిత్.. అసలు సమరంలో మాత్రం తేలిపోయాడు. యువ హిట్టర్ ఇషాన్ కిషన్‌ పాకిస్తాన్‌పై ఆడుతాడని అందరూ అనుకున్నా.. అది జరగలేదు. హార్దిక్ పాండ్యా స్థానంలో ఇషాన్ ఆడతాడని అందరూ ఊహించిన విషయం తెలిసిందే.

రోహిత్ ఆడింది చూడలేదా

రోహిత్ ఆడింది చూడలేదా

మ్యాచ్ అనంతరం తమ ఓటమికి గల కారణాలను వివరిస్తూ.. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జవాబిచ్చాడు. ఈ సమయంలో ఓ రిపోర్టర్ కోహ్లీకి కఠినమైన ప్రశ్న వేశాడు. 'రోహిత్ శర్మ చాలా పేలవంగా ఆడాడు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ని ఆడిస్తే బాగుండేది. మీరు ఏమంటారు?' అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు కోహ్లీ మొదట షాకయినా.. అనంతరం రిపోర్టర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. 'మీరు చాలా ధైర్యంగా ప్రశ్నించారు.

కానీ ఇది అవసరం లేని, అడగాల్సిన ప్రశ్న మాత్రం కాదు. మీకు ఏదైనా కాంట్రవర్సీ కావాలంటే నాకు ముందుగానే చెప్పండి. దానికి అనుగుణంగా సమాధానం ఇస్తాను. అంతేకానీ ఇలా అడిగితే నేనేమీ చెప్పలేను. వామప్ మ్యాచ్‌లో రోహిత్ ఆడింది చూడలేదా?' అని కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు.

SL vs BAN: చెలరేగిన చరిత్ అసలంక, భానుక రాజపక్స.. బంగ్లాపై శ్రీలంక భారీ విజయం! రికార్డు నెలకొల్పిన షకీబ్!

ఇది ఆరంభం మాత్రమే:

ఇది ఆరంభం మాత్రమే:

అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మేం అనుకున్న ప్రణాళికలను అమలు చేయలేకపోయాం. పాకిస్థాన్‌ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోతే.. తిరిగి పుంజుకోవడం కష్టం. మొదట బ్యాటింగ్‌ చేయడం అంత సులభం కాదు. పాకిస్తాన్ బ్యాటింగ్‌కు వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మంచు ప్రభావం కూడా ఉంది. తుది జట్టుపై ఎలాంటి బాధ లేదు. పాక్‌ గొప్పగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌లో ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు. ఇంకా మాకు మ్యాచులు ఉన్నాయి. విజయం సాధిస్తాం' అని ధీమా వ్యక్తం చేశాడు.

ఇదేం అంపరింగ్:

ఇదేం అంపరింగ్:

భారత్‌ ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ చర్చనీయాంశంగా మారింది. అతను నోబాల్‌కు పెవిలియన్‌ చేరాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సంబందించిన ఫొటోలు కూడా కొందరు పోస్ట్ చేస్తున్నారు. షహీన్‌ షా ఆఫ్రిది వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ తొలి బంతికి రాహుల్‌ బౌల్డయ్యాడు. కానీ బంతి వేసినపుడు షహీన్‌ కాలు గీత దాటినట్లుగా ఫొటో, వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీనికి సంబందించిన స్క్రీన్‌ షాట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో, వీడియోలు చూసిన భారత ఫాన్స్ మండిపడుతున్నారు. 'ఇదేం అంపరింగ్', 'మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను ఔట్ చేశాడు' అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, October 25, 2021, 7:33 [IST]
Other articles published on Oct 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X