Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓపెనింగ్ ఫెయిల్యూర్: జర్నలిస్ట్ ప్రశ్నకు కోహ్లీ ఇచ్చిన రిప్లై ఇదీ

హైదరాబాద్: సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో టీ20లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో టీమిండియా సొంతం చేసుకుంది. భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై టీమిండియాకిది హ్యాట్రిక్‌ సిరీస్‌ విజయం.

మూడు టీ20లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. అంతేకాదు ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో కోహ్లీ కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టీ20 సిరిస్‌లో పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో విమర్శల పాలయ్యాడు.

ఈ నేపథ్యంలో కెప్టెన్సీలో కోహ్లీ కంటే ధోనినే అత్యుత్తమనే వాదనలను క్రికెట్ విశ్లేషకులు తెరపైకి తీసుకొచ్చారు. మూడో టీ20 విజయం అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ కోహ్లీని ఇరుకున పెట్టే ప్రయ్తనం చేశాడు. ఓపెనర్‌గా ఫెయిలయినట్లు అనిపించడం లేదా? అని ఓ జర్నలిస్ట్ కోహ్లీని ప్రశ్నించాడు.

 Virat Kohli

ఇందుకు కోహ్లీ చిరునవ్వుతో 'నేను మీకు ఏమి చెప్పాలి సార్? సిరిస్ గెలిచిన తర్వాత మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు?' అని అన్నాడు. 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరుపున నాలుగు సెంచరీలు చేసినప్పుడు ఎవరూ ఏం మాట్లాడలేదు. ఈ టీ-20 సిరీస్‌లో రన్స్ చేయకపోవడంతో అందరూ ఇలాంటి ప్రశ్నలేస్తున్నారు. రెండు మ్యాచ్‌ల్లో 70 పరుగులు చేసుంటే, ఈ ప్రశ్న అడిగేవాళ్లా' అని కోహ్లీ ఆ జర్నలిస్ట్‌కు ఎదురు ప్రశ్న వేశాడు.

'సర్, వేరే వాళ్లపై కూడా ఫోకస్ పెట్టండి. ఇంకా పది మంది ఉన్నారు. వాళ్లను కూడా బాగా ఆడనివ్వండి. నా ఫామ్ గురించి బాధపడటం లేదు. ఇది ఎంతో అద్భతమైన సిరిస్ అని' ఇంగ్లాండ్‌పై విజయం సాధించినందుకు అందరం ఆనందించాలని కోహ్లీ చెప్పాడు. టీ20 సిరీస్‌లో టీమిండియా విజయం సాధించడం పట్ల తనకెంతో ఆనందంగా ఉందని కోహ్లీ చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+