
న్యూ ఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌గా.. భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన కోహ్లీ.. టాప్ రేటెడ్ బ్యాట్స్‌మెన్‌గానూ సచిన్ టెండుల్కర్ రికార్డులను బ్రేక్ చేయగలిగిన సత్తా గల యువ క్రికెటర్‌గా కోహ్లీ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఆటతీరుతో పాటు అతని లైఫ్ స్టైల్‌కు కూడా అభిమానులు ఎక్కువ. అయితే ఓ కొత్త ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నానంటూ ట్విట్టర్ వేదికగా కొన్నిరోజుల క్రితమే ప్రకటన చేశాడు.
'ట్రైలర్ ది మూవీ' పేరుతో ఓ పోస్టర్ కూడా విడుదల చేశాడు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో కొహ్లీ పెట్టిన పోస్ట్‌తో అభిమానుల అంచనాలు పెరిగిపోయాయి. విరాట్ సతీమణి అనుష్క శర్మతో కలిసి సినిమా తీస్తున్నాడంటూ కొందరు.. బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటూ మరికొందరు..ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
పదేళ్ల తర్వాత మరో అరంగేట్రం చేయబోతున్నా.. ఏ మాత్రం వేచి ఉండలేను... ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరచాడు. సినిమా పోస్టర్‌ను తలపించేలా ట్రైలర్ పేరుతో ఓ టీజర్‌ను తాజాగా మరోసారి అభిమానుల ముందుంచాడు. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కొహ్లీ అడుగుపెట్టాడు. పదేళ్ల తర్వాత అంటే ప్రస్తుత యేడాదిలో మరో ఫీల్డ్‌లో అరంగేట్రం చేయబోతున్నట్లు కొహ్లీనే స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
సెప్టెంబర్ 28న విరాట్ ట్రైలర్ మూవీ విడుదల కాబోతోంది. ట్రైలర్ అనేది సినిమానా లేక ప్రమోషనల్ వీడియోనా అనేది ఇప్పటికీ సందిగ్ధమే. సొంత వ్యాపారాలలో భాగంగా వస్త్ర దుకాణాల బ్రాండ్ 'రాంగ్' కోసం వినూత్నంగా ప్రచారం చేసేందుకే ట్రైలర్ పేరుతో ప్రమోషనల్ వీడియో విడుదల చేయబోతున్నాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 'ట్రైలర్ ది మూవీ' అనేది ఏంటో తెలియాలంటే 28వరకూ వేచి చూడాలి.