Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3వ వన్డేలో 34వ సెంచరీతో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులివే

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా బుధవారం కేప్ టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత​ కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.

India vs South Africa : Virat Kohli & co aim for Whitewash
వన్డేల్లో 34వ సెంచరీ

వన్డేల్లో 34వ సెంచరీ

మూడో వన్డేలో తన కెరీర్‌లో 34వ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 12వ సెంచరీ. దీంతో కెప్టెన్‌గా 11 సెంచరీలు నమోదు చేసిన సౌరవ్ గంగూలీ రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత కెప్టెన్‌ రికార్డు కూడా విరాట్ కోహ్లీ(14) పేరిటే ఉన్న సంగతి తెలిసిందే.

 వన్డేల్లో 100 సిక్సర్లు

వన్డేల్లో 100 సిక్సర్లు

దీంతో పాటు వన్డేల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఎనిమిదో భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. కేప్ టౌన్ వన్డేలో కోహ్లీ రెండు సిక్సర్లు సాధించిన తర్వాత వన్డేల్లో 100 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (216)తో అగ్రస్థానంలో ఉన్నాడు.

 సఫారీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు

సఫారీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు

ఇక, తన కెరీర్‌లో 34వ వన్డే సెంచరీ చేసిన క్రమంలో దక్షిణాఫ్రికాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతకముందు సఫారీ గడ్డపై సచిన్‌ (152) సాధించిన స్కోరే ఇప్పటివరకు అత్యధికం. బయట చూస్తే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ చేసిన 160 పరుగులు వన్డేల్లో సఫారీలపై భారత బ్యాట్స్‌మన్‌కు రెండో అత్యుత్తమం.

 సింగిల్స్‌ ద్వారానే వంద పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌

సింగిల్స్‌ ద్వారానే వంద పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌

2010లో సఫారీలు భారత పర్యటనకు వచ్చిన సమయంలో సచిన్ గ్వాలియర్‌లో ఆ జట్టుపై డబుల్‌ సెంచరీ సాధించాడు. మూడో వన్డేలో కోహ్లీ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. సింగిల్స్‌ ద్వారానే వంద పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌ కోహ్లి. ఈ మ్యాచ్‌లో 75 సింగిల్స్‌ తీసిన కోహ్లీ 11 సార్లు 2 పరుగులు, ఒకసారి 3 పరుగుల చొప్పున తీశాడు.

 మరో రెండు వన్డే సెంచరీలు సాధిస్తే

మరో రెండు వన్డే సెంచరీలు సాధిస్తే

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఆరు వన్డేల సిరిస్‌లో విరాట్ కోహ్లీ మరో రెండు వన్డే సెంచరీలు సాధిస్తే అత్యధిక సెంచరీలు కొట్టిన కెప్టెన్ల జాబితాలో ఏబీ డివిలియర్స్‌ రికార్డును బద్దలు కొడతాడు. వన్డేల్లో ప్రస్తుతం ఏబీ డివిలియర్స్‌(13) రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా చూస్తే, కెప్టెన్‌గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన జాబితాలో రికీ పాంటింగ్‌(22) అగ్రస్థానంలో ఉన్నాడు.

Story first published: Thursday, February 8, 2018, 14:32 [IST]
Other articles published on Feb 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+