
గతంలో సత్తా చాటిన కోహ్లీ
సౌతాఫ్రికా గడ్డపై విరాట్ కోహ్లీకి ఘనమైన రికార్డులే ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ 5 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 10 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 55 సగటుతో 558 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 153 పరుగులు. స్ట్రైక్ రేట్ 57గా ఉంది. కాగా ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ అందరికంటే ముందున్నాడు. సచిన్ ఇక్కడ వెయ్యికిపైగా పరుగులు చేశాడు. అంతేకాకుండా సౌతాఫ్రికాలో టెస్టుల్లో వెయ్యికి పైగా పరుగులు చేసింది సచిన్ ఒక్కడే.

వన్టేల్లో కోహ్లీకి సూపర్ రికార్డులు
సౌతాఫ్రికా గడ్డపై విరాట్ కోహ్లీకి వన్డేల్లో కూడా ఘనమైన రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై 17 వన్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 15 ఇన్నింగ్స్‌లో 87 సగటుతో పరుగులు చేశాడు. 90 స్ట్రైక్‌రేట్‌తో మొత్తంగా 877 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా ఓ ఇన్నింగ్స్‌లో 160 పరుగులు చేశాడు. దీంతో ఈ సారి కూడా సౌతాఫ్రికా గడ్డపై కోహ్లీపై భారీ అంచనాలున్నాయి.

ప్రాక్టీస్‌లో బిజీగా కోహ్లీ
గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా సిరీస్‌లో రాణించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నుంచి విలువైన సూచనలు తీసుకుంటూ సాధనలో మునిగి తేలుతున్నాడు. కాగా కోహ్లీ కెప్టెన్‌గా ఇప్పటివరకు రవిశాస్త్రి కోచింగ్‌లోనే టీమిండియాను నడిపించాడు. దీంతో మెదటి సారి రవిశాస్త్రి లేకుండా రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో అసలైన సమరానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఇది వరకే భారత్‌లో న్యూజిలాండ్‌తో ఈ కాంబినేషన్ ఓ టెస్ట్ మ్యాచ్ ఆడిన అది అంత పెద్ద మ్యాచ్ కాదని చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications
