For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కింగ్ కోహ్లీ - ఒక్క ఇన్నింగ్‌తో ఎన్నెన్నో రికార్డులు మటాష్ చేసిన మొనగాడు..!!

Virat Kohli records as most runs scorer in T20 World Cup and T20I for India

మెల్‌‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత్.. తన చిరకాల ప్రత్యర్థిపై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. అల్లాటప్పా విక్టరీ కాదది. దేశ ప్రధానిని సైతం కదలించిన గ్రేట్ ఇన్నింగ్. ఆసియా కప్ 2022లో ఏ పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవి చూసిందో- అదే పాకిస్తాన్‌పై తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది.

ఒంటిచేత్తో..

ఒంటిచేత్తో..

టీమిండియా సాధించిన ఈ విజయానికి అసలు సిసలు కారకుడు- విరాట్ కోహ్లీ. 31 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుకు ఒంటిచేత్తో విజయ తీరానికి చేర్చాడు కింగ్ కోహ్లీ. తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. విరాట పర్వం ఎలా ఉంటుందో పాకిస్తానీయులకు చూపించాడు. 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు విరాట్. మరో ఎండ్‌లో హార్దిక్ పాండ్యా సహకారంతో చెలరేగాడు.

 సత్తాకు నిదర్శనం..

సత్తాకు నిదర్శనం..

విరాట్ కోహ్లీ సత్తాకు నిలువుటద్దంలా మారిందీ ఇన్నింగ్. ప్రతి ఒక్కరు కూడా అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్‌ను ఆశించారు. కొన్ని నెలలుగా ఫామ్‌ను కోల్పోయి తీవ్ర విమర్శలకు గురైన కోహ్లీపై ఒక దశలో వేటు పడుతుందనే అంచనాలు సైతం వ్యక్తం అయ్యాయి. అతని పనైపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆసియా కప్‌తో కోహ్లీ ఆటతీరు మళ్లీ ట్రాక్‌లో పడింది. ఈ టోర్నమెంట్ తరువాత ఆడిన టీ20 ఇంటర్నేషనల్స్‌లో చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు.

 పాకిస్తాన్‌పై అత్యధిక పరుగులు..

పాకిస్తాన్‌పై అత్యధిక పరుగులు..

అదే ఊపుతో పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డాడు కోహ్లీ. మెల్‌బోర్న్‌లో ఆడిన ఈ ఒక్క ఇన్నింగ్‌తో ఎన్నో విమర్శలకు చెక్ చెప్పాడు.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టేశాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు రికార్డులు మటాష్ అయ్యాయి. టీ20 ఇంటర్నేషనల్స్‌లో విరాట్ కోహ్లీని కొట్టే మొనగాడు సమీప భవిష్యత్తులో ఉండడు. అటు పాకిస్తాన్‌ బౌలర్లపైనా సునామీలా విరుచుకుపడే భారత క్రికెటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు.

టీ20ల్లో టాప్ స్కోరర్..

టీ20ల్లో టాప్ స్కోరర్..

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లల్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక్కడే. టీ20 ఇంటర్నేషనల్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను రోహిత్ శర్మను దాటేశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ముందు వరకు రోహిత్ శర్మే టాప్ స్కోరర్. ఇది చెరిగిపోయింది. 2010-2022 మధ్య జరిగిన టీ20 ఇంటర్నేషనల్స్‌లో విరాట్ కోహ్లీ 3,773 పరుగులు చేశాడు. ఇదే గ్యాప్‌లో రోహిత్ శర్మ-3,741, మార్టిన్ గప్టిల్-3,531, బాబర్ ఆజమ్- 3,231, పాల్ స్టిర్లింగ్-3,119 పరుగులు చేశారు.

అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్స్..

అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్స్..

అవేకాకుండా- ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఇలాంటి ఈవెంట్లల్లో పాకిస్తాన్‌పై అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డులను గెలుచుకుంది కూడా విరాట్ కోహ్లీనే. అలాగే- ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్‌ను అందుకున్న వారిలో రెండోస్థానంలో నిలిచాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ ఫిగర్ కూడా కోహ్లీ పేరు మీదే ఉంది.

50కి పైగా..

50కి పైగా..

ఓ టీ20లో ఎక్కువసార్లు 50కి పైగా పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీదే. 35 సార్లు అతను టీ30 ఇంటర్నేషనల్స్‌లో 50కి పైగా పరుగులు సాధించాడు. టీ20ల్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18 సార్లు నాటౌట్‌గా ఉన్నాడు కోహ్లీ. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం కంటే దాన్ని ఛేదించడానికి విరాట్ కోహ్లీ ఎక్కువగా ఇష్టపడతాడనేది ఈ ఇన్నింగ్‌తో మరోసారి స్పష్టమైంది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 18సార్లు నాటౌట్‌గా నిలిచాడు కోహ్లీ.

Story first published: Monday, October 24, 2022, 7:30 [IST]
Other articles published on Oct 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+