Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎట్టకేలకు డిడిసిఏ నుంచి ఫీజు దక్కించుకున్న కోహ్లీ

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా వివాదాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్రికెట్ అసోసియేష‌న్(డీడీసీఏ) త‌మ ఆట‌గాళ్ల‌కు నెమ్మ‌దిగా పాత బ‌కాయిల‌ను అంద‌జేస్తోంది. ఈ బ‌కాయిలు అందుకున్న‌వారిలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ కూడా ఉన్నారు.

మూడేళ్ల కింద‌ట (2013లో)ఎన్కేపీ సాల్వే ట్రోఫీలో ఢిల్లీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించినందుకుగాను కోహ్లీకి రావాల్సిన రూ.1,76,400ల‌ను డీడీసీఏ చెల్లించింది. గత డిసెంబ‌ర్‌లో విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఆడినందుకుగాను ధావ‌న్ రూ. 2,37,600 అందుకున్నాడు.

Virat Kohli receives payment of Rs 1.76 lakh by DDCA for leading Delhi in 2013

ఈ బ‌కాయిలు అందుకున్న‌వారిలో టీమిండియా మాజీ క్రికెట‌ర్లు సెహ్వాగ్‌, గంభీర్ కూడా ఉన్నారు. సెహ్వాగ్‌కు రూ.9 వేలు, గంభీర్‌కు రూ.4500ల‌ను డీడీసీఏ చెల్లించింది.

ఇన్నాళ్లూ ఖ‌జానాలో డబ్బు లేనందువ‌ల్లే పెద్ద ఆట‌గాళ్ల‌కు కూడా బ‌కాయిలు చెల్లించ‌లేక‌పోయామ‌ని డీడీసీఏ కోశాధికారి ర‌వింద‌ర్ మ‌న్‌చందా వెల్ల‌డించారు. తగిన మొత్తంలో డబ్బులు రావడంతోనే చెల్లిస్తున్నామని తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+