Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీళ్లకు పిచ్చి పట్టింది.. నా చేయిని గుర్తుపట్టట్లేదు: కోహ్లీ

 Virat Kohli recalls the time when a waiter failed to recognise him

హైదరాబాద్: పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తనదైన బ్యాటింగ్‌ శైలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కోహ్లీ ఎక్కడికి వెళ్లినా అతడితో కలిసి ఫొటో, సెల్ఫీ దిగేందుకు, షేక్‌ హ్యాండ్ ఇచ్చేందుకు అభిమానులు, చిన్నారులతో సహా ఎదురుచూస్తుంటారు. అలాంటిది కోహ్లీ షేక్‌ హ్యాండ్‌ ఇద్దామని చేయి చాచినా అతడు తీసుకోలేదట. అంతేకాదు అతడు కోహ్లీ అని ఆ వ్యక్తి గుర్తించనేలేదట.

వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఒకరోజు కొందరు ఆటగాళ్లు డిన్నర్‌కు బయటకు వెళ్లారు. ఓ రెస్టారెంట్‌లో అందరూ కలిసి తింటుండగా ఒక వెయిటర్‌ కోహ్లీని గుర్తుపట్టాడు. వారి టేబుల్‌ వద్దకు వచ్చి కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత మరో వెయిటర్‌ ఆటగాళ్ల టేబుల్‌ వద్దకు వచ్చాడు.

ఈ వెయిటర్‌ కూడా తనతో కరచాలనం చేసేందుకే వచ్చాడేమో అనుకుని కోహ్లీ చేయి చాచాడు అంట. కానీ, ఆ వెయిటర్ కోహ్లీ చాచిన చెతిని పట్టించుకోకుండా టేబుల్‌పై ఉన్న ప్లేట్లను తీసుకుని వెళ్లిపోయాడట. దీంతో ఒక్కసారిగా ఆటగాళ్లంతా పెద్దగా నవ్వేశారంట. ఈ విషయంపై స్పందించిన 'కోహ్లీ.. వీళ్లకు పిచ్చి పెట్టింది. నా చేతిని కూడా గుర్తు పట్టట్లేదు.' అని ఓ ప్రైవేటు మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

మరోసారి కోహ్లీ, అనుష్కలు విదేశీ పర్యటనలో ఫిన్‌ల్యాండ్ వెళ్లగా అక్కడ వారిని గుర్తు పట్టిన ముగ్గురు ఇండియన్లు ఫొటోలు తీయబోగా వారిని కోహ్లీ, అనుష్కలు సోషల్ మీడియాలో పెట్టొద్దంటూ వారించడంతో వారు కూడా అనుకూలంగానే స్పందించారు. ప్రస్తుతం కోహ్లీ సేన ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. జూన్ నెల 27, 29న ఆతిథ్య ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంగ్లాండ్‌ వెళ్లనుంది.

Story first published: Sunday, June 24, 2018, 12:59 [IST]
Other articles published on Jun 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+