For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా సెలక్షన్‌కి లంచం అడిగారు.. షాకింగ్ న్యూస్ బయటపెట్టిన కోహ్లీ!!

Virat Kohli recalls incident when his father refused to offer bribe for sons selection

ముంబై: రికార్డులకు పెట్టింది పేరు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన కోహ్లీ ఇప్పటి వరకు 70 అంతర్జాతీయ సెంచరీలు చేసాడు. అలానే 21,901 పరుగులు చేశాడు. కోహ్లీ దెబ్బకు ఎందరో మాజీ దిగ్గజాల రికార్డులు ఇప్పటికే బద్దలయ్యాయి. దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ ఆయన స్థానాన్ని భర్తీ చేశాడని నిపుణులు అంటారు. రన్ మెషిన్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. అయితే తన కెరీర్ ఆరంభ దశలో ఎదురైన ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు.

నాన్నను లంచం అడిగారు:

నాన్నను లంచం అడిగారు:

ఢిల్లీ జట్టులో తన సెలక్షన్ కోసం అధికారులు లంచం అడిగితే.. త‌న తండ్రి ప్రేమ్ కోహ్లీ తిర‌స్క‌రించాడ‌ని భారత స్టార్ ఫుట్‌బాల‌ర్ సునీల్ చెత్రితో కలిసి సోష‌ల్ మీడియాలో మాట్లాడిన విరాట్ కోహ్లీ తెలిపాడు. 'ఢిల్లీలో కొన్ని సమయాల్లో పనులు నిజాయితీగా జరగవు. ఉదాహరణకు సెలక్షన్ విషయంలో ఎవరో వ్యక్తి రూల్స్ ప్రకారం వెళ్లలేదు. అతను మా నాన్నతో మెరిట్ ప్రకారం సెలెక్ట్ అవ్వాలంటే.. లంచం ఇవ్వాలని అన్నాడట' అని విరాట్ తెలిపాడు. అయితే తన తండ్రి అందుకు ససేమీరా ఒప్పుకోలేదని అతను అన్నాడు.

ఒక్క రూపాయి ఇవ్వనని చెప్పారు:

ఒక్క రూపాయి ఇవ్వనని చెప్పారు:

'మా నాన్న ఓ మిడిల్‌క్లాస్ వ్యక్తి. ఒక విజయవంతమైన లాయర్‌గా జీవితం గడిపిన వ్యక్తి. అప్పడు ఆయన అదనంగా ఒక్క రూపాయి ఇచ్చేందుకు అంగీకరించలేదు. మీరు విరాట్‌ని సెలక్ట్‌ చేయాలంటే.. అతని మెరిట్ ప్రకారం చేయండి, అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పారు' అని విరాట్ తెలిపాడు. ఆ తర్వాత త‌న పేరు సెలెక్ష‌న్‌లో చోటు చేసుకోలేదని, తను ఎంతో బాధ‌కు లోన‌య్యాన‌ని భారత కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ఆ సంఘ‌ట‌న నుంచి తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాన్నాడు.

18వ ఏట చ‌నిపోయారు:

18వ ఏట చ‌నిపోయారు:

జీవితంలో హార్డ్‌వ‌ర్క్‌తోనే ఎదగ‌గ‌ల‌మని, అడ్డ‌దారుల్లో వెళ్లోద్దని తండ్రి ప్రేమ్ కోహ్లీ మాటల ద్వారా గ్రహించిన‌ట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. నిజానికి కోహ్లీ టీమిండియాలోకి ఎంపిక కాకముందే అంటే 18వ ఏట చ‌నిపోయారు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.

నాన్న ప్రభావం చాలా ఉంది:

నాన్న ప్రభావం చాలా ఉంది:

ఇంతకుముందు విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మా నాన్న ఈ లోకంలో ఉన్నంతకాలం నా సూపర్‌ హీరో. చాలా మంది మనకు స్ఫూర్తి, ప్రేరణనిస్తారు. కానీ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తూ స్ఫూర్తి, ప్రేరణ కలిగించడం వేరు. నాకు నాన్న ప్రత్యక్ష ఉదాహరణగా ఉంటూ ఎంతో ప్రేరణనిచ్చారు. నా ఆదర్శం మా నాన్న. నాన్న ప్రభావం నాపై చాలా ఉంది. చిన్నప్పుడు క్రికెట్‌ ఆడుతున్నప్పుడు నా కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు అన్ని నాన్నే తీసుకొనేవారు. విభిన్న కోణాల్లో నాకు విషయాలు చెప్పేవారు. ఆయన నిర్ణయాలతో నా దృష్టి శ్రమించడం పైనే ఉండేది. సొంత కష్టంతోనే ముందుకు సాగాలని, మరో మార్గం లేదని నాకు ఆయన వ్యక్తిత్వం వల్లే అర్థమైంది. దానిపైనే ఎక్కువగా దృష్టి సారించా. నాన్న నిర్ణయాల వల్లే నా కెరీర్‌ సులభంగా సాగింది' అని తెలిపాడు.

సాకులు చెప్పడం మానేశా:

సాకులు చెప్పడం మానేశా:

'బాగా కష్టపడి ముందుకొచ్చా. నేను విజయవంతం అయ్యానంటే నా జీవితం మారుతుంది. లేదంటే నేను బాగా ఆడనట్టే. ఈ విషయం తెలుసుకున్న తర్వాత సాకులు చెప్పడం మానేశా. ఇది మా నాన్న వల్లే సాధ్యమైంది. నా జీవితంలో సాధించిన విజయాలన్నీ మా నాన్న వల్లే జరిగాయి' అని కోహ్లీ తన తండ్రిని గుర్తుచేసుకున్నాడు. విరాట్ కోహ్లీపై 'సూపర్ వీ' పేరుతో స్టార్‌స్పోర్ట్స్‌లో ఓ యానిమేటెడ్ సిరీస్ వచ్చిన విషయం తెలిసిందే.

Story first published: Monday, May 18, 2020, 21:40 [IST]
Other articles published on May 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+