నేను ఓటేస్తున్నా.. మరి మీరు: విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మే 12న హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓటేయనున్నాడు. ఈ మేరకు ఆదివారం విరాట్ స్వయంగా ఇన్‌స్టా ద్వారా ప్రకటించాడు. అంతేకాదు తన ఓటరు కార్డును కూడా షేర్ చేశాడు. 'మే 12న గురుగ్రామ్‌లో నేను ఓటేస్తున్నా.. మరి మీరు? ' అంటూ పేర్కొన్నాడు.

గడువులోగా దరఖాస్తు చేయలేదు:
ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న కోహ్లీ తొలుత అక్కడే ఓటు వేయాలని భావించాడు. అయితే ఆసీస్ టూర్, ఐపీఎల్‌లో విరాట్ బిజీగా ఉండడంతో నిర్ణీత గడువు ముగిసేలోగా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేయలేదు. దీంతో ఈ ఎన్నికల్లో విరాట్ ఓటు వేసే అవకాశం కోల్పోయాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఓటు వేస్తున్నట్టు కోహ్లీయే స్వయంగా ప్రకటించడంతో ఆ వార్తలకు తెరపడింది.

బెంగళూరు ఫైనల్‌కు చేరుకుంటే:
శనివారం వరకు విరాట్ కోహ్లీ ఓటు వేస్తాడా? లేదా? అన్న అనుమానం అందరిలో ఉండేది. ఎందుకంటే శనివారం వరకు బెంగళూరు ఆడిన 11 మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో బెంగళూరు తప్పనిసరిగా నెగ్గితే ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బెంగళూరు ఫైనల్‌కు చేరుకుంటే కోహ్లీ మే 12న ఓటు హక్కును వినియోగించుకోవడం కష్టంగా మారేది.

ఓటు వేయడం ఖాయం:
ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయి.. ఐపీఎల్ 12లో లీగ్ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. తాజా ఓటమితో ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు చేరుకునే అవకాశం లేదు. దీంతో విరాట్ కోహ్లీ ఓటు వేయడం ఖాయం అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications