బయోపిక్‌లో నటించేందుకు సిద్ధం..కానీ ఆమె హీరోయిన్‌గా కావాలి: కోహ్లీ

ముంబై: క్రీడా నేపథ్యంలో బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా బయోపిక్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, మేరీ కోమ్, మిల్కా సింగ్, మహావీర్ సింగ్ ఫోగట్ వంటి దిగ్గజాలపై బయోపిక్‌లు రూపొందాయి. భారత మహిళా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్, టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన హరియాణా హరికేన్ కపిల్ దేవ్‌పై కూడా సినిమాలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వీరందరి సినిమాల్లో లీడ్ రోల్ ఎవరో ఒకరు పోషించారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనపై రూపొందించే బయోపిక్‌లో లీడ్ రోల్‌ను పోషించేందుకు సిద్ధమని తాజాగా తెలిపాడు.

లీడ్ రోల్‌ను పోషించేందుకు సిద్ధం
భారత ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రీ ఆదివారం విరాట్ కోహ్లీతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా కోహ్లీని ఇరకాటంలో వేస్తూ.. పలు ప్రశ్నలు ఛెత్రీ సంధించాడు. ఛెత్రీ మాటలకు ఆశ్యర్యపోయిన కోహ్లీ.. తర్వాత ఆయన ప్రశ్నలకు వివరణలు ఇచ్చాడు. గంటకుపైగా సాగిన సంభాషణలో ఇద్దరి మధ్యా అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తనపై రూపొందించే బయోపిక్‌లో లీడ్ రోల్‌ను పోషించేందుకు సిద్ధమని ప్రకటించాడు.

అనుష్కనే హీరోయిన్‌గా కావాలి
విరాట్ కోహ్లీ తనపై బయోపిక్ చేయడంలో ఎలాంటి సమస్యలు లేవన్నాడు. అయితే తన బయోపిక్‌లో లీడ్ రోల్ పోషించడానికి మాత్రం ఒక షరతు పెట్టాడు. తనపై రూపొందించే బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్, సతీమణి అనుష్క శర్మ హీరోయిన్ అయితేనే నటించేందుకు సిద్ధమని కోహ్లీ అన్నాడు. విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు. ఇక 2017, డిసెంబర్ 11 విరాట్-అనుష్క ఇటలీలో వివాహం చేసుకున్నారు.

అనుష్క నా జీవితంలోకి ప్రవేశించాకే
అనుష్క శర్మ జీవితంలోకి ప్రవేశించాక తన దృక్ఫథం ఎంతో మారిందని ఇటీవలే విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. 'నిజాయతీగా చెప్పాలంటే అనుష్క శర్మతో పరిచయం నాలో చాలా మార్పులకు కారణమైంది. గతంలో నేను ప్రతీ చిన్న విషయానికి కొప్పడేవాడిని. తీవ్ర అసహనానికి గురయ్యేవాడిని. ఇప్పుడు ఆ ధోరణి మారింది. అనుష్క నాలో శాంతన్ని నింపిందనుకుంటా. అనుష్క వ్యక్తిత్వం, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆమె ప్రశాంతంగా ఉండడం నిజంగా నన్ను ప్రేరేపించింది' అని కోహ్లీ గతంలో తెలిపాడు.

పెళ్లైనప్పటి నుంచి ఆమెతో ఇన్ని రోజులు కలిసుండలేదు
'పెళ్లైనప్పటి నుంచి మేమిద్దరం ఒకేచోట ఇన్ని రోజులు కలిసి ఉండటం ఇదే తొలిసారి. ఒకేసారి ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు. కాక్రికెట్, సినిమాలతో ఇద్దరం బిజీగా ఉండేవాళ్లం. ఇప్పుడు కాస్త వింతగా ఉంది. ప్రమాదకర కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించాలనుకోవడం సరికాదు. కానీ.. అదే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూల దృక్పథంతో ఉండాలి. ఇవి కఠిన రోజులు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

2008లో అంతర్జాతీయ ఆరంగేట్రం
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications