Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ 'ఓవర్సీస్ ప్లేయర్'? కింగ్ రియాక్షన్ ఇదే! (వీడియో)

ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటారు. తాజాగా ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియోలో విరాట్ కోహ్లీ తనను "ఓవర్సీస్ ప్లేయర్" (విదేశీ ఆటగాడు) అని పిలవడంపై స్పందిస్తూ నవ్వు ఆపుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి లండన్‌లో ఎక్కువ సమయం గడుపుతుండటంతో ఫ్యాన్స్ సరదాగా.."ఈ సీజన్లో ఆర్సీబీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడుతోంది(కోహ్లీని కలిపి)" అంటూ జోకులు పేలుస్తున్నారు. దీనిపై ఆర్సీబీ ఫేమస్ క్యారెక్టర్ 'మిస్టర్ నాగ్స్' విరాట్ కోహ్లీని ప్రశ్నించగా.. విరాట్ నవ్వుతూ అసలు ఈ విషయం తనకెందుకు అడుగుతున్నావని ఎదురు ప్రశ్నించారు. 'నేను విదేశీ ఆటగాడిని కాదు, కావాలంటే ఆ విదేశీ ప్లేయర్లనే అడుగు' అంటూ విరాట్ కోహ్లీ చమత్కరించారు.

ఐపీఎల్ 2026లో కోహ్లీ కింగ్ ఫామ్
కేవలం జోకులతోనే కాకుండా తన బ్యాట్‌తో కూడా విరాట్ కోహ్లీ ఈ సీజన్లో గట్టి సమాధానం ఇస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ తన మార్క్ ఛేజ్ మాస్టర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. చిన్నస్వామి స్టేడియంలో 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ కేవలం 38 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ విధ్వంసంతో ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200+ పరుగులు ఛేజ్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.

Virat Kohli Reacts to Overseas Player Tag in Viral RCB Video Breaks Records in IPL 2026 Details

కింగ్ కోహ్లీ సృష్టించిన సరికొత్త రికార్డులు
ఈ సీజన్ ఆరంభంలోనే విరాట్ కోహ్లీ పలు అరుదైన మైలురాళ్లను అందుకున్నారు. మొదటి మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్‌తో షోయబ్ మాలిక్‌ను వెనక్కి నెట్టి టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. అంతే కాకుండా ఐపీఎల్ చరిత్రలో కేవలం లక్ష్య ఛేదనలో 4,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే విరాట్ కోహ్లీ త్వరలోనే ఐపీఎల్‌లో 9,000 పరుగుల మార్కును దాటేలా కనిపిస్తున్నాడు. తన హోం గ్రౌండ్ బెంగళూరులో విరాట్ కోహ్లీ చూపిస్తున్న దూకుడు చూస్తుంటే ఈ సీజన్లో పరుగుల వరద పారడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

Story first published: Saturday, April 4, 2026, 12:08 [IST]
Other articles published on Apr 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+