
జట్టులో నుంచి తీసేయాలన్నారు!
తొలి మూడు మ్యాచుల్లో నిరాశ పరచడంతో విమర్శలపాలైన అతను.. పాక్‌పై 4 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై కూడా పేలవంగా ఆడి 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. చివరగా సౌతాఫ్రికాత జరిగిన మ్యాచ్‌లో కూడా 9 పరుగులకే మైదానం వీడాడు. దీంతో జట్టులో రాహుల్ స్థానంపై ప్రశ్నలు తలెత్తాయి. జట్టుకు మంచి ఓపెనింగ్ ఇవ్వడంలో రాహుల్ విఫలం అవుతున్నాడని, దీంతో రోహిత్, కోహ్లీలపై ఒత్తిడి పెరుగుతోందని విమర్శకులు ఆరోపించారు. అతని స్థానంలో రిషభ్ పంత్‌ను తీసుకుంటే జట్టుకు అవసరమైన ఓపెనింగ్ లభిస్తుందన్నారు. అభిమానులు కూడా రాహుల్‌ను పక్కనపెట్టి కోహ్లీతో ఓపెనింగ్ చేయించాలని, లేదంటే సూర్యకుమార్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేయాలని డిమాండ్లు చేశారు. వీళ్లందరికీ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్.. తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు.

దంచికొట్టిన రాహుల్..
కేవలం 32 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. రాహుల్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు. నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అద్భుతంగా ఆడిన రాహుల్ కొట్టిన ఒక సిక్సర్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి చూసిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా షాకైపోయాడు. ఆ సిక్స్ వెళ్లిన షాట్‌ను నమ్మలేనట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ బాల్ నోబాల్ కావడంతో రాహుల్‌కు ఫ్రీహిట్ కూడా దక్కింది.

రాహుల్ తర్వాత కోహ్లీ కూడా..
ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను.. మరింత భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ దురదృష్టవశాత్తూ అదే స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత తను గేరు మార్చిన విరాట్ కోహ్లీ కూడా వేగంగా ఆడాడు. మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ తన టీ20 కెరీర్‌లో 36వ హాఫ్


Click it and Unblock the Notifications