
ఆసియాకప్ 2022లో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన సూపర్ 4మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా భావిస్తున్న విషయం అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ డ్రాప్. ఇప్పుడు ఈ విషయం పట్ల నెట్టిట తెగ చర్చ జరుగుతుంది. అర్ష్‌దీప్ సింగ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో చివరి 18బంతుల్లో పాక్ విజయానికి 34పరుగులు చేయాల్సిన తరుణంలో రవి బిష్ణోయ్ బౌలింగ్ అందుకున్నాడు.
రెండు వైడ్లు వేసి క్రీజులో ఉన్న ఆసిఫ్ అలీని కాస్త లయ దెబ్బతీసేలా చేశాడు. అయితే 3వ బంతికి ఆసిఫ్ అలీ హిట్టింగ్ చేయాలని చూడగా బంతి గాల్లోకి లేచింది. ఇక గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ సింగ్ సునాయసంగా క్యాచ్ అందుకోవాల్సింది. లడ్డూ లాంటి క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. అర్షదీప్ సింగ్‌పై ఓ రేంజులో అరిచాడు. ఇక ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేది.
ఇక అర్షదీప్ సింగ్ కీలకమైన క్యాచ్ డ్రాప్ చేశాడు కదా.. ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది. ఈ విషయమై మీరేం అంటారు అని కోహ్లీని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో అడగ్గా.. ఇది క్రికెట్. ఇందులో ఎవరైనా ఒకానొక టైంలో తప్పు చేయవచ్చు. ఆ టైంలో మ్యాచ్ పరిస్థితి తీవ్ర ఉత్కంఠగా ఉంది. ఇలాంటి అధిక ప్రెషర్‌తో కూడిన మ్యాచ్‌లలో తప్పులు జరగవచ్చు. దాన్ని అంత పెద్దగా చూడాల్సిన పని లేదు. అర్షదీప్ సింగ్ కుర్రాడు. అతనికి ఇంకా చాలా నేర్చుకునే టైం ఉంది.' అని కోహ్లీ అన్నాడు.
'నేను నా విషయంలో ఇలాంటి జరిగిన ఓ ఉదంతాన్ని చెబుతాను. నేను కెరీర్ తొలినాళ్లలో తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌తో ఓ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ఇప్పటికీ నాకు గుర్తుంది. నేను షాహిద్ అఫ్రిది బౌలింగ్లో ఓ చెత్త షాట్ ఆడాను. నేను ఔటయ్యాక నాకు మనసు మనసులా లేదు. ఇక ఆ రోజు రాత్రి నిద్రేపోలేదు.
నేను ఉదయం 5గంటల వరకు సీలింగ్ ఫ్యాన్ చూస్తూనే ఉన్నాను. ఆ టైంలో నా కెరీర్ ముగిసింది ఇక అనిపించింది. కానీ నెమ్మదిగా ఆడుతున్న కొద్దీ కొన్ని విషయాలు జరిగిపోయాయి.. ఇక తరచి తరచి గుర్తుచేసుకుని డీలాపడడం సబబు కాదనిపించింది. ఇప్పుడు అర్షదీప్ సింగ్ ఈ క్యాచ్ గురించి మర్చిపోయి మున్ముందు మరింత గొప్ప ప్రదర్శన ఇచ్చేదుకు ట్రై చేయాలి. ప్లేయర్లు తమ తప్పుల నుండి నేర్చుకుంటారు. కాబట్టి ఎవరైనా అతని తప్పును మన్నించాలి. దాన్ని అతను పరిష్కరించుకోగలడు. మరోసారి ఒత్తిడిలో పడకుండా అర్ష ట్రై చేయాలి.' అని కోహ్లీ పేర్కొన్నాడు.