న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఘనత సాధిస్తాడా?: టెస్టు ర్యాంకింగ్స్‌లో 2వ స్ధానంలో కోహ్లీ

By Nageshwara Rao
Virat Kohli reaches second in ICC Test rankings

హైదరాబాద్: గురువారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్ధానానికి ఎగబాకాడు. శ్రీలంకతో మూడో టెస్టుకు ముందు కోహ్లీ ఐదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో కోహ్లీ 893 పాయింట్లతో మూడు స్ధానాలు ఎగబాకి రెండో స్ధానానికి కైవసం చేసుకున్నాడు.

ఇక, రెండో స్ధానంలో ఉన్న పుజారా రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ 938 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక శ్రీలంక టెస్టు కెప్టెన్ దినేశ్ చండీమాల్ తన కెరీర్‌లోనే తొలిసారి టాప్-10లో నిలిచాడు. ఢిల్లీ టెస్టులో చండీమాల్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.

Virat Kohli reaches second in ICC Test rankings

దీంతో 743 పాయింట్లతో దినేశ్ చండీమాల్ 8వ స్థానంలో నిలిచాడు. ఇక భారత క్రికెటర్లు మురళీ విజయ్‌(25), రోహిత్‌ శర్మ(40) తమ స్థానాలను మరింతగా మెరుగు పరుచుకున్నారు. కాగా, ఆసీస్‌కు చెందిన క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ 2005-06 డిసెంబర్-జనవరి మధ్య అన్ని ఫార్మాట్లలో నంబర్‌వన్‌ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఆ తర్వాత అసీస్‌కే చెందిన మాథ్యూ హెడెన్‌ ఈ ఘనతను అందుకున్నాడు. మరోవైపు శ్రీలంకతో టెస్టు సిరీస్‌ సందర్భంగా బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తాడని భావించిన రవీంద్ర జడేజా ఒక స్థానంలో కోల్పోయి 870 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు.

యాషెస్ సిరిస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 5 వికెట్లతో రాణించిన ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ బౌలర్ల జాబితాలో అగ్రస్ధానంలో నిలిచాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే శ్రీలంకపై 1-0తేడాతో సిరీస్‌ సొంతం చేసుకున్న టీమిండియా ఒక పాయింట్‌ కోల్పోయి 124 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.


Test team

1 India: 124

2 South Africa: 111

3 England: 105

4 New Zealand: 97

5 Australia: 97

6 Sri Lanka: 94

7 Pakistan: 88

8 West Indies: 75

9 Bangladesh: 72

10: Zimbabwe: 2


Batsmen's rankings

1 Steve Smith: 938

2 Virat Kohli: 893

3 Joe Root: 879

4 C Pujara: 873

5 K Williamson: 865


Bowlers' ranking

1 James Anderson: 894

2 Kagiso Rabada: 876

3 Ravindra Jadeja: 870

4 R Ashwin: 820

5 Rangana Herath: 799

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 7, 2017, 13:48 [IST]
Other articles published on Dec 7, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X