Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs leic Warm Up Match: కోహ్లీ హాఫ్ సెంచరీతో అలరించాడు.. 366పరుగుల లీడ్‌లో టీమిండియా

kohli

ఇండియా మరియు లీసెస్టర్‌షైర్ మధ్య వార్మప్ మ్యాచ్‌‌లో 3వ రోజు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌‌కు కెప్టెన్ రోహిత్ శర్మ రాలేదు. ఇక మిగతా ప్లేయర్లు కొద్దో గొప్పో బానే ఆడారు. ఇక భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అర్ధసెంచరీలు (2వ సారి) హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో భారత్ 364 పరుగుల స్కోరు చేయగలిగింది. కోహ్లీ 69 బంతుల్లో 2సిక్సర్లు, నాలుగు బౌండరీలతో 50పరుగుల మార్క్‌ను దాటాడు. ఇక 98బంతుల్లో 67పరుగులు చేసిన తర్వాత కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా విరాట్ (33పరుగులు 69బంతుల్లో) బానే ఆడాడు. దీంతో అతను తన మునుపటి ఫామ్ అందుకునే వీలుంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (56), మహ్మద్ సిరాజ్ (1) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. చివరి రోజైన 4వ రోజు ఆట తిరిగి ప్రారంభమవుతుంది.

భారత బ్యాటర్లలో రెండో ఇన్నింగ్స్‌లో శ్రీకర్ భరత్ (43), శుభ్ మాన్ గిల్ (38), హనుమ విహారి (20), శ్రేయస్ అయ్యార్ (62 రెండుసార్లు బ్యాటింగ్ ), రవీంద్రా జడేజా (56 రెండుసార్లు బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్ (28), విరాట్ కోహ్లీ (67), చెటేశ్వర్ పుజారా (22) ఆడారు. ఇకపోతే తొలి ఇన్నింగ్స్‌లో లీసెస్టర్ షైర్ తరఫున ఆడిన పుజారా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున బ్యాటింగ్ చేయడం గమనార్హం. అలాగే రవీంద్రా జడేజా, శ్రేయస్ అయ్యార్ ఔటయ్యాక రెండో సారి బ్యాటింగ్‌కు దిగారు. ప్రస్తుతం ఇండియా 366పరుగుల లీడ్ సాధించింది. ఇకపోతే లీసెస్టర్ షైర్ తరఫున ఆడిన ఇండియన్ బౌలర్లు నవదీప్ సైని 3, కమలేష్ నాగర్ కోటీ 2, రవిశ్రీనివాసన్ సాయికిషోర్ 1 వికెట్ తీశారు. ఇక జస్ప్రీత్ బుమ్రా సైతం ఒక వికెట్ పడగొట్టాడు.

ఇకపోతే జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో అయిదోది మరి చివరిదైన టెస్టు మ్యాచ్ కోసం భారత్ సిద్ధమవుతుంది. ఇక ఈ టెస్ట్ తర్వాత మూడు వన్డేలు, మూడు టీ20లు కూడా ఇంగ్లాండ్‌తో భారత్ ఆడనుంది. దీనికి ముందు జూన్ 26, జూన్ 28న ఐర్లాండ్‌తో భారత్ 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడనుంది.

Story first published: Saturday, June 25, 2022, 23:41 [IST]
Other articles published on Jun 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+