న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎస్‌సీజీ సభ్యత్వం: రవిశాస్త్రి, విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం

India vs Australia 1st ODI : Virat Kohli, Ravi Shastri Receive Honorary Membership Of SCG | Oneindia
Virat Kohli and Ravi Shastri get honorary membership of Sydney Cricket Ground

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా కోహ్లీ, శాస్త్రికి సిడ్నీ క్రికెట్ స్టేడియం(ఎస్‌సీజీ) వారిని జీవిత కాల గౌరవ సభ్యులుగా ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ఇటీవలే టెస్టు సిరీస్‌ను నెగ్గిన సంగతి తెలిసిందే.

పాండ్యా, రాహుల్‌లతో టీమ్‌ బస్సులో కూడా ప్రయాణించను: క్రికెటర్ల పరువు తీశారన్న భజ్జీపాండ్యా, రాహుల్‌లతో టీమ్‌ బస్సులో కూడా ప్రయాణించను: క్రికెటర్ల పరువు తీశారన్న భజ్జీ

చారిత్రక టెస్టు విజయంలో

చారిత్రక టెస్టు విజయంలో

ఈ చారిత్రక టెస్టు విజయంలో కెప్టెన్ కోహ్లీ, కోచ్ శాస్త్రి కీలకంగా వ్యవహరించారు. క్రికెట్‌కు చేసిన సేవలు, సిడ్నీ మైదానంలో చరిత్ర సృష్టించినందుకు వారిని ఇలా సత్కరించామని ఎస్‌సీజీ చైర్మన్ టోనీ షెఫర్డ్ అన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్ట్ సిరీస్‌ను దక్కించుకున్న భారత జట్టుకు ఎస్‌సీజీ తరఫున అభినందనలు" తెలిపారు.

సుదీర్ఘ ఫార్మాట్‌కు అభిమానుల్లో

సుదీర్ఘ ఫార్మాట్‌కు అభిమానుల్లో

"టెస్ట్ క్రికెట్‌ను కోహ్లీ, శాస్త్రి మరింత ముందుకు తీసుకెళుతున్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు అభిమానుల్లో మరింత ఆసక్తి కల్గించేలా పోటీ వాతావరణం నెలకొల్పుతున్నారు. ప్రపంచంలోనే క్రికెట్‌ను అమితంగా అభిమానించే భారత్ లాంటి దేశం టెస్ట్ క్రికెట్‌పై దృష్టిపెట్టడం చాలా బాగుంది. టెస్టులకు పునర్‌ వైభవం కల్పించేందుకు ఇది కీలక అడుగు" అని ఎస్‌సీజీ చైర్మన్ టోనీ షెఫర్డ్ అన్నారు.

ట్విట్టర్‌లో రవిశాస్త్రి

ఇంతకుముందు ఎస్‌సీజీ సభ్యత్వం పొందిన క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్‌తో పాటు బ్రియాన్ లారా ఉన్నారు. ఈ సందర్భంగా కోహ్లీతో కలిసి సభ్యత్వం అందుకున్న రవిశాస్త్రి ట్విటర్‌లో ఈ విషయం వెల్లడించారు. "విరాట్‌ కోహ్లీతో కలిసి ఎస్‌సీజీ గౌరవ సభ్యత్వం అందుకోవడం చాలా సంతోషకరం. గౌరవం" అని రవిశాస్త్రి ట్వీట్‌ చేశాడు. శాస్త్రి, కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా 2-1తో టెస్టు సిరీస్‌ నెగ్గింది.

Story first published: Saturday, January 12, 2019, 10:57 [IST]
Other articles published on Jan 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X