Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kohli Ranji: 'కంట్రోల్ చేయలేం.. అర్జెంట్ గా ఎక్స్‌ట్రా ఫోర్స్ కావాలి' - పోలీస్ షాక్!!

"సార్ తక్కువ అంచనా వేశాం. ఈ అభిమానుల్ని కంట్రోల్ చేయాలంటే మనకు మరింత సెక్యూరిటీ ఫోర్స్ అవసరం. దయచేసి మరింత మందిని వీలైనంత త్వరగా ఈరోజే పంపించండి".. ఏంటి అర్థం కాలేదా?... కోహ్లీ రంజీ మ్యాచ్ కోసం బందోబస్త్ కు వచ్చిన ఓ పోలీస్ అధికారి.. తనపై అధికారితో చెప్పిన మాటలివి. సరే, ఇప్పుడు అర్థమై ఉంటది కదా అక్కడ అసలు ఏం జరిగిందనేది.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. దిల్లీ తరఫున జనవరి 30న రైల్వేస్ జట్టుతో తలపడనున్నాడు. దీనికోసం ఇప్పటికే దిల్లీ టీమ్ తో కలిసి అరుణ్ జెట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. అయితే ఈ మ్యాచ్ కోసం దిల్లీ క్రికెట్ సంఘం భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేస్తోంది. ఎందుకంటే కోహ్లీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మ్యాచ్ కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ స్టేడియానికి వస్తారని అంచనా వేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.దాదాపుగా 10వేల మందికిపైగా ప్రేక్షకులు వస్తారని.. భద్రతను పటిష్టం చేస్తోంది.

Virat Kohli Ranji match Sub-inspector police is shocked by seeing Fans crowded at arun jaitely stadium

కంగుతిన్న పోలీస్ అధికారి
అయితే మ్యాచ్ జరగడానికి రెండు రోజుల ముందే అరుణ్ జెట్లీ స్టేడియంలో కోహ్లీ ప్రాక్టీస్ చేస్తోన్న సంగతి తెలిసి.. అభిమానులు ముందుగానే మైదానానికి తరలి వస్తున్నారు. విరాట్ చూసేందుకు ఎగబడుతున్నారు. జర్నలిస్టులు, కెమెరా మెన్స్ కూడా చాలా మంది అక్కడికి చేరుకుని విరాట్ ను క్లిక్ మనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మైదానం గేట్లు దగ్గర, పరిసర ప్రాంతాల్లో, భారీ ఎత్తున ఫ్యాన్స్ గూమిగుడారు. దీంతో అక్కడికి బందోబస్త్ కు వచ్చిన ప్రదీప్ రానా అనే దిల్లీకు చెందిన ఓ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్.. అలర్ట్ అయ్యారు. కోహ్లీ కోసం వచ్చిన అభిమానుల్ని చూసి కంగుతిన్న ఆయన.. వారిని కంట్రోల్ చేసేందుకు మరింత మంది సెక్యూరిటీ ఫోర్స్ కావాలని తనపై అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫ్రీ ఎంట్రీ-లైవ్ మ్యాచ్
ఇప్పటికే దిల్లీ క్రికెట్ సంఘం మ్యాచ్ జరగబోయే వచ్చే ఫ్యాన్స్ కోసం.. టికెట్ల అవసరం లేకుండానే ప్రతి ఒక్కరికీ ఫ్రీ ఎంట్రీ కూడా ఏర్పాటు చేసింది. నార్త్‌ ఎండ్, ఓల్డ్‌ క్లబ్‌ హౌస్‌ను కూడా ఓపెన్‌ చేయబోతుందని తెలిసింది. అదనపు సీటింగ్‌ను సిద్ధం చేయనుందని సమాచారం అందింది. అలానే ఈ మ్యాచ్ కు లైవ్ కవరేజీ ఇవ్వనున్నారు.జియో సినిమా ఓటీటీలో ఈ దిల్లీ మ్యాచ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు బీసీసీఐ తాజాగా ప్రకటించింది.

Story first published: Wednesday, January 29, 2025, 14:44 [IST]
Other articles published on Jan 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+