Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిట్‌నెస్ వీడియో.. సాహసాలు చేస్తున్న విరాట్ కోహ్లీ!!

Virat Kohli Fitness Feets Ahead Of 3rd T20I Against New Zealand || Oneindia Telugu
Virat Kohli raises the bar once again with motivational fitness post on Instagram

హామిల్టన్: టీమిండియా ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్ విరాట్‌ కోహ్లీ. భారత జట్టులో కోహ్లీ ఒక బెంచ్ మార్కును సెట్ చేసాడు. తాను మాత్రమే ఫిట్‌గా ఉండకుండా.. జట్టు సభ్యులందరిని ఆ విధంగా తయారుచేస్తున్నాడు. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టాక టీమిండియాలో ఫిట్‌నెస్‌ పతాక స్థాయికి చేరింది. నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం భారత క్రికెటర్లకి ఉన్న ఫిట్‌నెస్ క్రికెట్ ప్రపంచంలోని మరే జట్టుకీ లేదు.

 కోహ్లీ బెంచ్ మార్కు

కోహ్లీ బెంచ్ మార్కు

విరాట్‌ కోహ్లీ తన అమోఘమైన ఫిట్‌నెస్‌తో జట్టు సభ్యుల అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు. విరాట్‌ స్ఫూర్తితో ఇప్పటికే భారత జట్టులోని ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సిక్స్ ప్యాక్ సాధించారు. యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, శివమ్ దూబేలు కూడా కోహ్లీని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. కోహ్లీ ఎక్కడికి వెళ్లినా.. తన వ్యాయామంను మాత్రం కొనసాగిస్తూనే ఉంటాడు.

 కోహ్లీ సాహసాలు:

కోహ్లీ సాహసాలు:

టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడో టీ20 మ్యాచ్‌ కోసం భారత ఆటగాళ్లు హామిల్టన్‌లో ఉన్నారు. హామిల్టన్‌లో కూడా కోహ్లీ వ్యాయామం చేస్తూ కష్టపడుతున్నాడు. జంపింగ్ చేస్తూ సాహసాలు చేస్తున్నాడు. ఓ డబ్బాను రవీంద్ర జడేజా పట్టుకోగా.. కోహ్లీ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి డబ్బాపైకి దూకాడు. పక్కనే రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. దీనికి సంబందించిన ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో కోహ్లీ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఫిట్‌నెస్‌తోనే కోహ్లీ అద్భుతాలు:

ఈ ఫిట్‌నెస్‌తోనే మైదానంలో విరాట్ కోహ్లీ అద్భుతాలు చేస్తున్నాడు. అటు బ్యాటింగ్‌లో పరుగుల వరద పారిస్తూ.. మరోవైపు ఫీల్డింగ్‌లో కూడా కళ్లుచెదిరే క్యాచ్‌లతో ఔరా అనిపిస్తున్నాడు. గత నాలుగేళ్లలో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కోహ్లీ తరహాలో ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఆధిపత్యం చెలాయించలేకపోయాడంటే అతిశయోక్తి కాదేమో. ఫామ్, ఫిట్‌నెస్, కెప్టెన్సీ ఇలా అన్ని విషయాల్లోనూ అగ్రశ్రేణి ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లీ లాంటి క్రికెటర్ తమ జట్టులోనూ ఒకడుంటే బాగుండేదని క్రికెట్ ప్రపంచంలోని అన్ని జట్లూ ఇప్పుడు ఆశిస్తున్నాయి.

 ఫుట్‌బాల్‌ ఆటగాళ్లను చూసి నేర్చుకుంటాం:

ఫుట్‌బాల్‌ ఆటగాళ్లను చూసి నేర్చుకుంటాం:

గతంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మేం ఎప్పుడూ ఫుట్‌బాలర్ల క్రమశిక్షణను గమనిస్తుంటాం. ఇది మాకు అవసరం. మైదానంలోకి వెళ్లి ఆడాలంటే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. ఫిట్‌నెస్‌, పోషకాహారం, విశ్రాంతి తదితర అంశాల్లో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారు. మేం వారిని చూసి నేర్చుకుంటాం' అని తెలిపాడు.

ఒక్క టీ20 గెలిస్తే:

ఒక్క టీ20 గెలిస్తే:

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా హవా కొనసాగుతోంది. రెండు టీ20ల్లోనూ కోహ్లీసేన ఘన విజయం సాధించింది. మూడో టీ20 మ్యాచ్‌ హామిల్టన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. కివీస్ గడ్డపై ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టీ20 సిరీస్ గెలవని టీంఇండియా.. హామిల్టన్ టీ20లో గెలిస్తే సిరీస్‌ని కైవసం చేసుకోనుంది.

Story first published: Tuesday, January 28, 2020, 13:54 [IST]
Other articles published on Jan 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+