Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ రెండు భారీ రికార్డుల‌కు విరాట్ గండం: బ‌ద్ద‌లు కావ‌డం ఖాయం!

ICC Cricket World Cup 2019 : Kohli Puts Sachin Tendulkar, Brian Lara's Record Under Threat
Virat Kohli Puts Sachin Tendulkar, Brian Laras Record Under Threat

సౌథాంప్ట‌న్‌: అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటిదాకా న‌మోదైన అన్ని ర‌కాల రికార్డుల‌కూ స‌మీప భ‌విష్య‌త్తులో పొంచివున్న ఒకే ఒక్క గండం పొంచి ఉంది. ఆ గండం పేరే.. విరాట్ కోహ్లీ. భార‌త క్రికెట్ జ‌ట్టు కేప్టెన్. విరాట్ కోహ్లీ ధాటికి మొన్న‌టికి మొన్నే ఓ రికార్డు బ‌ద్ద‌లైపోయింది కూడా. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ అధిగ‌మించేశాడు. వ‌న్డేల్లో అత్యంత వేగంగా 11,000 ప‌రుగుల మార్క్‌ను అందుకున్న రికార్డు నిన్న‌, మొన్న‌టి దాకా స‌చిన్ టెండుల్క‌ర్ పేరిట ఉండేది.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 20 వేల ప‌రుగులు..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 20 వేల ప‌రుగులు..

ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లోని మాంఛెస్ట‌ర్‌లో ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా దీన్ని దాటేశాడు కోహ్లీ. తాజాగా- మ‌రో రెండు రికార్డుల‌కు విరాట్ కోహ్లీ గండం పొంచివుంది. అందులో ఒక‌టి స‌చిన్ టెండుల్క‌ర్‌కు సంబంధించిన‌దే. స‌చిన్‌తో పాటు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్‌మెన్ రికీ పాంటింగ్ ఖాతాల్లో మాత్ర‌మే ఈ రికార్డు ఉంది. విరాట్ కోహ్లీ కాస్త గ‌ట్టిగా ఆడితే ఆఫ్ఘ‌నిస్తాన్‌తో సౌథాంప్ట‌న్‌లో శ‌నివారం జ‌రిగే మ్యాచ్‌లోనే దీన్ని చెరిపివేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఆఫ్ఘ‌న్‌తో మ్యాచ్‌లోనే దీన్ని అధిగ‌మిస్తాడా?

ఆఫ్ఘ‌న్‌తో మ్యాచ్‌లోనే దీన్ని అధిగ‌మిస్తాడా?

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మ‌ట్ల‌లో క‌లిపి 20 వేల ప‌రుగుల మైలురాయిని అందుకోవ‌డానికి విరాట్ కోహ్లీ కేవ‌లం 104 ప‌రుగుల దూరంలో మాత్ర‌మే ఉన్నారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ 104 ప‌రుగులను చేయ‌గ‌లిగితే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 20 వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్న నాలుగో బ్యాట్స్‌మెన్‌గా ఆవిర్భ‌విస్తాడు విరాట్ కోహ్లీ. ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. అన్ని ఫార్మ‌ట్ల‌తో క‌లిపి అంటే వ‌న్డే, టెస్ట్ మ్యాచ్‌లు, టీ20ల్లో క‌లిపి ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ 19,896 ప‌రుగులు చేశాడు కోహ్లీ. దీనికోసం అత‌ను 415 ఇన్నింగ్‌ల‌ను తీసుకున్నాడు.

స‌చిన్, లారా 453 ఇన్నింగుల్లో..

స‌చిన్, లారా 453 ఇన్నింగుల్లో..

స‌చిన్ టెండుల్క‌ర్ గానీ, బ్రియాన్ లారా గానీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మ‌ట్ల‌లో 20 వేల ప‌రుగుల‌ను అందుకోవ‌డానికి మొత్తం 453 చొప్పున ఇన్నింగ్‌ల‌ను ఆడారు. ఆస్ట్రేలియా మాజీ కేప్టెన్ రికీ పాంటింగ్ సైతం ఈ మార్క్‌ను అందుకున్న‌ప్ప‌టికీ.. 468 ఇన్నింగ్‌ల‌ను తీసుకోవాల్సి వ‌చ్చింది. విరాట్ కోహ్లీకి మాత్రం అన్నేసి ఇన్నింగులు అవ‌స‌రం లేదు. గ‌ట్టిగా ఆడితే ఒకే ఒక ఇన్నింగ్ చాలు. మ‌రీ అంత‌గా అవ‌స‌రం వ‌స్తే ఇంకోటి. అంతే. ప్ర‌స్తుతం కోహ్లీ 415 ఇన్నింగ్‌ల‌ల్లో 19,896 ప‌రుగుల‌ను చేశాడు. ఇందులో 131 టెస్ట్ మ్యాచ్‌లు, 222 వ‌న్డేలు, 62 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.

 ఆఫ్ఘ‌నిస్తాన్‌తోనే దీన్ని సాధించే అవ‌కాశాలు?

ఆఫ్ఘ‌నిస్తాన్‌తోనే దీన్ని సాధించే అవ‌కాశాలు?

ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అద్భుత‌మైన ఫామ్‌లో కొన‌సాగుతున్నాడు. అదే స‌మ‌యంలో- ఆఫ్ఘ‌నిస్తాన్ బౌలింగ్ బ‌ల‌హీన‌త‌లేంటో అత‌నికి తెలుసు. పైగా ఇంగ్లండ్‌పై జ‌రిగిన త‌న వెనుక‌టి మ్యాచ్‌లో భారీగా ప‌రుగుల‌ను స‌మ‌ర్పించుకుని, ఆత్మ‌విశ్వాస లేమితో కొట్టుమిట్టాడుతోందా టీమ్‌. బౌలింగ్ విభాగం ఊహించినంత భ‌యంక‌రంగా ఏమీ లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో విరాట్ కోహ్లీ కాస్త గ‌ట్టిగా, శ్ర‌ద్ధ‌గా ఆడితే అత‌ని ఖాతాలో మ‌రో సెంచ‌రీ వ‌చ్చి చేర‌డంతో పాటు త‌క్కువ ఇన్నింగుల్లో అన్ని ఫార్మ‌ట్ల‌లో 20, 000 ప‌రుగుల‌ను సాధించిన క్రికెట‌ర్‌గా ఆవిర్భ‌విస్తాడు.

Story first published: Friday, June 21, 2019, 12:48 [IST]
Other articles published on Jun 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+