Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రేమ సాగరంలో అన్యోన్యంగా ప్రయాణిస్తున్నాం.. అనుష్కతో కోహ్లీ ట్రెక్కింగ్!!

Virat Kohli published a picture with wife Anushka Sharma, trekking down a hill


హైదరాబాద్: బంగ్లాదేశ్ పర్యటన అనంతరం లభించిన విశ్రాంతి సమయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. బంగ్లా సిరీస్‌ను ముగించుకుని కోల్‌కతా నుండి ముంబై చేరుకున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం సరదాగా గడుపుతున్నాడు.

అనుష్కతో కోహ్లీ ట్రెక్కింగ్:

డిసెంబర్ మొదటి వారంలో వెస్టిండీస్ పర్యటన ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో వెస్టిండీస్‌-భారత జట్లు 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్నాయి. వెస్టిండీస్‌ పర్యటనకు సమయం ఉండడంతో కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి ట్రెక్కింగ్‌కి వెళ్ళాడు. విరుష్క జోడి అందమైన కొండపైన ట్రెక్కింగ్ చేశారు. దీనికి సంబందించిన ఫొటోను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. 'ప్రేమతో జీవిత ప్రయాణంలో కలిసి ప్రయాణిస్తున్నాం' అని కోహ్లీ కాప్షన్ ఇచ్చాడు.

'బెస్ట్ కపుల్:

'బెస్ట్ కపుల్:

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'విరుష్క జోడి సూపర్' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'బెస్ట్ కపుల్' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు ముందు కోహ్లీ స్వల్ప విరామం తీసుకుని భూటాన్‌లోని అందమైన ప్రదేశాలను చుట్టొచ్చాడు. ఇటీవలే కోహ్లీ 31వ ఏట ప్రవేశించాడు. తన జీవితంలోని ఈ అద్భుతమైన రోజును సంతోషంగా గడపడానికి అనుష్కతో కలిసి భూటాన్‌లో విహారానికి వెళ్లాడు.

వరుసగా ఏడో టెస్టు విజయం:

వరుసగా ఏడో టెస్టు విజయం:

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా ఏడో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా వైట్‌వాష్‌ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. అదే సమయంలో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలతో సరికొత్త రికార్డును కూడా టీమిండియా నెలకొల్పింది.

కోహ్లీ @ 20000:

కోహ్లీ @ 20000:

గత పదేండ్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితా టాప్‌లో నిలిచిన కోహ్లీ.. అత్యధిక సెంచరీలు (69), అర్ధ సెంచరీ (95)ల రికార్డును కూడా తన పేరిట రాసుకున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ 50కి పైగా సగటుతో పరుగులు చేసిన రన్‌మెషీన్‌.. టెస్టుల్లో 8818, వన్డేల్లో 11,036, టీ20ల్లో 2450 (మొత్తం 20,688) రన్స్‌ చేశాడు.

Story first published: Wednesday, November 27, 2019, 16:52 [IST]
Other articles published on Nov 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+