న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లిని బ్రూస్ లీతో పోల్చిన కపిల్ : ఎందుకంటే?

న్యూఢిల్లీ : క్రీజులో చకచకా కదలాలన్న.. ఫీల్డింగ్ లో మెరుపులు మెరిపించాలన్నా.. క్రికెటర్లకు ఫిట్ నెస్ చాలా ముఖ్యం. తనదైన మార్క్ బ్యాటింగ్ తో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి.. ఫిట్ నెస్ విషయమై మాజీల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి.

తాజాగా కోహ్లి ఫిట్ నెస్ పై స్పందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.. షర్ట్ లేకుండా కోహ్లి ఉన్న ఫోటోను చూస్తోంటే.. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ గుర్తుకొస్తున్నాడని కోహ్లిని ఆకాశానికెత్తేశాడు. ఫిట్ నెస్ పై కోహ్లి చాలా శ్రద్ద కనుబరుపస్తాడని, అందుకు తగ్గట్లుగా కష్టపడుతాడని చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్.

Virat Kohli posts nostalgic picture with childhood hero Rahul Dravid, feels grateful

ఇండియాటుడే.ఇన్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. కోహ్లి ఫిట్ నెస్ ను బ్రూస్ లీతో పోలుస్తూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కపిల్. ఇకపోతే ఖచ్చితమైన ఫిట్ నెస్ తో తన కెరీర్ ను కొసాగించిన కపిల్ దేవ్ గాయాల కారణంగా ఎప్పుడూ మ్యాచ్ ల నుంచి దాఖలా లేదు. ఇదే తరహాలో ఇప్పుడు కోహ్లి కూడా ఖచ్చితమైన డైట్ తో తన ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ వస్తున్నాడు.

మైదానంలో బ్యాట్ తో అదరగొట్టే కోహ్లి.. సోషల్ మీడియాలో తన ఫోటోల ద్వారా అభిమానులను అలరిస్తుంటాడు. ఇదే క్రమంలో చొక్కా లేకుండా వర్కవుట్స్ చేస్తోన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో కోహ్లి పోస్టు చేయడంతో.. దానిపై స్పందిస్తూ కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తాడు కపిల్. ఇటీవలే లారా రికార్డును కోహ్లి బద్దలు కొట్టగలడంటూ కపిల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X