Pic Viral: 16 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీ ఎలా ఉన్నాడో తెలుసా?

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా 16 ఏళ్ల వయసులో ఉన్న ఫోటోని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ చేసిన ట్వీట్‌లో మొత్తం రెండు ఫోటోలు మిక్స్ చేసి ఉన్నాయి.
ఎడమవైపున విరాట్ కోహ్లీ 16 ఏళ్ల వయసులో ఉన్న ఫోటో ఉండగా... కుడివైపున ప్రస్తుత విరాట్ కోహ్లీ ఫోటో ఉంది. "టీనేజ్‌లో నేను నన్ను చూసుకుంటూ" అంటూ కామెంట్ పెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తొలినాళ్లలో విరాట్ కోహ్లీ బొద్దుగా, ముద్దుగా ఉండేవాడు. ఫిట్‌నెస్ విషయంలో అతడిలో ఎంతో మార్పు వచ్చింది.
విరాట్ కోహ్లీ సాధించిన ఫిట్‌నెస్ లెవెల్స్ ఇప్పుడు ఏ యువ క్రికెటర్‌కైనా వృత్తిపరమైన అవసరంగా మారాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరిస్ ఆడుతోంది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది.

7 వికెట్ల తేడాతో విజయం
ఇక, బుధవారం మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ సిరిస్‌లో శుభారంభం చేసింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

కోహ్లీ హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చేసిన పరుగులు 2441. ఈ క్రమంలో అంతముందు వరకు ఈ జాబితాలో రోహిత్ శర్మ (2434) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కోహ్లీ అధిగమించాడు.

11వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
రెండో టీ20లో హాఫ్ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కోహ్లీకి ఇది 11వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కావడం విశేషం. ఈ క్రమంలో కోహ్లీ పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది రికార్డుని సమం చేశాడు. టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో షాహిద్ అఫ్రిది(11) అవార్డులను కోహ్లీ సమం చేశాడు.

టీ20ల్లో 22వది
అయితే, ఆప్ఘన్‌కు చెందిన మహ్మద్ నబీ(12) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సాధించిన హాఫ్ సెంచరీ అతడికి టీ20ల్లో 22వది కావడం విశేషం. ఈ క్రమంలో రోహిత్ శర్మ(21) హాఫ్ సెంచరీల రికార్డుని సైతం కోహ్లీ అధిగమించాడు. దీంతో పాటు మూడు ఫార్మాట్లలో 50కిపైగా యావరేజిని కలిగి ఉన్న ఏకైక క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications