Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS NZ: ఫైనల్ మ్యాచ్.. సచిన్ సాధించిన ప్రపంచ రికార్డ్ జాబితాలోకి విరాట్ కోహ్లీ!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ రసవత్తర సమయానికి వేళైంది. మార్చి 9న ఈ ఉత్కంఠ పోరులో భారత్ - న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి 25 ఏళ్ల ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అభిమానులంతా కూడా మనోళ్లే గెలవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకం కానుంది. ఈ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెరీర్ లో మరో మైలురాయిని అందుకోనున్నాడు. చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో నిలిచాడు.

ఈ మ్యాచ్ ప్రత్యేకం ఏంటంటే
కోహ్లీ క్రికెట్ లో ఎన్నో రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. అలానే తన బ్యాటింగ్ స్టైల్ తో ప్రపంచ క్రికెట్ లో ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ.. అప్పటి నుంచి భారత జట్టులో కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు. అలా ఇప్పుడతడు తన అంతర్జాతీయ కెరీర్ లో 550వ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్ గా నిలవనున్నాడు.

virat Kohli playing his 550th International match for India with Champions Trophy 2025 final

అంతకుముందు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. అతడు తన కెరీర్ లో 664 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. అలానే ప్రపంచ వ్యాప్తంగా 550 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు ఆడిన ఆరో ప్లేయర్ గానూ నిలిచాడు కోహ్లీ. సచిన్ తో పాటు మహేలా జయవర్దనే, కుమార్ సంగక్కర, సనత్ జయసూర్య, రికీ పాంటింగ్ ఈ ఘనత అందుకున్నారు.

బిగ్ రికార్డ్స్‌పై కోహ్లీ కన్ను..
ఈ ఫైనల్ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ బిగ్ రికార్డ్స్‌పై కన్నేశాడు. మరో 46 పరుగులు చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 791 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. అలానే మరో 55 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం కుమార సంగక్కర 14,234 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

Story first published: Sunday, March 9, 2025, 11:12 [IST]
Other articles published on Mar 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+