ఇండోర్‌లో కోహ్లీ గల్లీ క్రికెట్.. పిల్లలతో కలిసి పరుగులు (వీడియో)

ఇండోర్: తీరిక లేని క్రికెట్ ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. విశ్రాంతి తీసుకున్న కోహ్లీ కొద్ది రోజుల క్రితం తన భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్ పర్యటనకు వెళ్ళాడు. అక్కడే అనుష్కతో కలిసి తన 31వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు. విరుష్క జోడి దాదాపు ఓ వారం రోజుల పాటు అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. భూటాన్ పర్యటన అనంతరం తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు.

కోహ్లీ గల్లీ క్రికెట్:
నవంబరు 14 నుంచి బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండు టెస్టు సిరీస్‌లకు కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు. ఇండోర్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. మరో రెండు రోజుల్లో తొలి టెస్టుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతుండగా.. కోహ్లీ మాత్రం కొంతమంది పిల్లలతో సరదాగా గడిపాడు. గల్లీ క్రికెట్ ఆడుతూ పిల్లలతో ఎంజాయ్ చేసాడు.

పిల్లలకు బౌలింగ్:
పిల్లలు బౌలింగ్ చేస్తుంటే.. కోహ్లీ కొన్ని భారీ షాట్లు ఆడాడు. పిల్లలతో కలిసి పరుగులు కూడా పెట్టాడు. తర్వాత పిల్లలకు బౌలింగ్ చేసి వారిని ఆనందపరిచాడు. దీంతో అక్కడి పిల్లలు అందరూ తెగ ఎంజాయ్ చేసారు. పిల్లలు అందరు ఇండోర్‌లోని ఓ అపార్ట్మెంట్‌కు చెందిన వారట. అటుగా వెళ్తున్న కోహ్లీ వారిని చూసి గల్లీ క్రికెట్ ఆడాడట. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫిట్‌నెస్ కోసం శాకాహారిగా :
డిల్లీలో పుట్టి పెరిగిన విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ కోసం శాకాహారిగా మారిన విషయం తెలిసిందే. ఫిట్‌నెస్ కోసం కొన్ని సంవత్సరాలుగా ఆహారపు అలవాట్లో ఎన్నో మార్పులు చేసాడు. అయినప్పటికి ఇప్పటికి కోహ్లీ మంచి భోజన ప్రియుడే. పంజాబీ వంటకాలైన రాజ్‌మా చావల్, బటర్ చికెన్, నాన్ తింటూ పెరిగాడు. అయినా ఇప్పటివరకు కోహ్లీకి వంట చేయటం రాదు. అందుకే రిటైర్ అయ్యాక వంట నేర్చుకోవాలనుకుంటున్నట్లు కోహ్లీ తెలిపాడు.
ఇండోర్‌లో తొలి టెస్టు:
బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరిస్ ముగిసింది. నవంబర్ 14 నుంచి ఇరు జట్ల మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత నవంబర్ 22 నుంచి డే/నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. డే/నైట్ టెస్టుకు ప్రాక్టీస్‌గా ఉంటుందని తొలి టెస్టుకి ముందే టీమిండియా ప్లడ్ లైట్ల కింద ప్రాక్టీస్ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపిసిఎ)ను టీమిండియా మేనేజ్‌మెంట్ అభ్యర్ధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications