Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

Virat Kohli played 100th t20 match as a captain, see top 5

హైదరాబాద్: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎలో టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్‌-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వహించిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మూడో వాడిగా నిలిచాడు.

ఐపీఎల్‌లో కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌కు నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా వందోది కావడం విశేషం. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక టీ20లకు కెప్టెన్‌గా వహించిన జాబితాలో విరాట్ కోహ్లీ 8వ వాడు.

అగ్రస్థానంలో ధోని

అగ్రస్థానంలో ధోని

అత్యధిక టీ20లకు కెప్టెన్‌గా వ్యవహారించిన భారత ఆటగాళ్ల జాబితాలో మహేంద్ర సింగ్‌ ధోని(244 మ్యాచ్‌లు)తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో గౌతమ్‌ గంభీర్‌(170 మ్యాచ్‌లు)తో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత విరాట్ కోహ్లీ మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు.

8వ స్థానంలో కోహ్లీ

8వ స్థానంలో కోహ్లీ

ఇక, అంతర్జాతీయ జాబితాలో కోహ్లీ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 234 టీ20లు ఆడాడు. ఇందులో 57 మ్యాచ్‌లు భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. బెంగళూరు నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

రాయుడు ఔటైన తర్వాత కూడా ధోని దూకుడు

రాయుడు ఔటైన తర్వాత కూడా ధోని దూకుడు

చెన్నై ఆటగాళ్లలో కెప్టెన్ ధోని (70 నాటౌట్‌; 34 బంతుల్లో ఒక ఫోర్, 7సిక్సులు) బాదగా, తెలుగు కుర్రాడు అంబటి రాయుడు (82; 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)తో చెలరేగాడు. 55 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నైని వీరిద్దరూ ఆదుకున్నారు. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రాయడు ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఉమేశ్‌ యాదవ్‌ జారవిడిచాడు.

 చివరి 5 ఓవర్లలో మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ధోని

చివరి 5 ఓవర్లలో మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ధోని

ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మ్యాచ్‌ 15 ఓవర్ల వరకు బెంగళూరు వైపే ఉన్నప్పటికీ, చివరి 5 ఓవర్లలో బెంగళూరు బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 18 ఓవర్‌లో రాయుడు 82(53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)ను ఉమేశ్‌ యాదవే రనౌట్‌ చేశాడు.

తదుపరి మ్యాచ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో

తదుపరి మ్యాచ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో

రాయుడు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చి బ్రేవో (14) సాయంతో ధోని (70) గెలుపుని సిక్సుతో లాంఛనంగా పూర్తి చేశాడు. బెంగళూరు బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు, ఉమేశ్ యాదవ్, పవన్ నేగి తలో వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. టోర్నీలో భాగంగా బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.

Story first published: Thursday, April 26, 2018, 17:03 [IST]
Other articles published on Apr 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+