Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'మరో 4 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో!'

విరాట్ కోహ్లీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్ తో మ్యాచ్ కు సిద్ధమయ్యాడు. ఇది అతడికి కెరీర్ లో 300వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. సాధారణంగానే విరాట్ మ్యాచ్ ఆడుతున్నాడంటే అందరీ దృష్టి అతడిపైనే ఉంటుది. ఇప్పుడు కెరీర్ లో మైల్ స్టోన్ మ్యాచ్ కావడం వల్ల ప్రతీ క్రికెట్ అభిమాని.. విరాట్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడా, ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ అభిమానులను ఉత్సాహపరిచేలా ఓ విషయాన్ని చెప్పారు అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ.

మరో నాలుగేళ్ల పాటు..
విరాట్ కోహ్లీ మరి కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడటాడని ధీమా వ్యక్తం చేశారు. అతడిలో ఇంకా ఎంతో క్రికెట్ దాగి ఉందని పేర్కొన్నారు. కోహ్లీకి ఉన్న అత్యున్నత ఫిట్ నెస్, ఆట పట్ల నిబద్ధత, అంకితభావం.. అతడి కెరీర్ మరింత ఎక్కువ కాలం ఉన్నత స్థాయిలో సాగేలా దోహదపడతాయని తెలిపారు.

Virat Kohli play international cricket atleast for four more years Childhood says coach Rajkumar sharma

ఆ మధ్య ఫామ్ లోమితో విరాట్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని, అతడికిది ఇదే చివరి ఐసీసీ టోర్ని అని వార్తలు వచ్చిన నేపథ్యంలో రాజ్ కుమార్ శర్మ ఈ వ్యాఖ్యలు చేయడం విరాట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. పైగా విరాట్ కూడా రీసెంట్ గా పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ తో సెంచరీ బాది ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. దీంతో అభిమానులంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లోనూ అతడు శతకం బాదాలని ఆశిస్తున్నారు.

"విరాట్ కచ్చితంగా నాలుగేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడు. అలానే అతడు అనుకోవాలే గానీ ఐపీఎల్ లోనూ చాలా ఏళ్ల పాటు కొనసాగుతాడు. అందులో నో డౌట్." అని శర్మ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా ఓపెనింగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 22 పరుగులు చేసిన విరాట్.. ఆ తర్వాత పాకిస్థాన్ పై శతకం బాదాడు.

Story first published: Sunday, March 2, 2025, 11:52 [IST]
Other articles published on Mar 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+