పుజారా కెప్టెన్సీలో ఆడనున్న విరాట్ కోహ్లీ
చెన్నై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఛటేశ్వర పుజారా కెప్టెన్సీ ఆడనున్నాడు. ఇండియా ఏ జట్టుకు పూజారా కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. జులై 28-31 వరకు చెన్నైలో జరగనున్న నాలుగు రోజులు రెండో టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు ఆస్టేలియా ఏ జట్టుతో తలపడుతుంది.
ఈ టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే పర్యటనకు పూర్తి విశ్రాంతి తీసుకున్న టీమిండియా టెస్టు విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నాడు. ప్రాక్టీస్ నిమిత్తం ఆస్టేలియా ఏ జట్టుతో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనుమతిని విరాట్ కోహ్లీ కోరాడు.

ఇందుకు సెలక్షన్ కమిటీ ఆమోదం తెలపడంతో నాలుగు రోజుల పాటు జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడతాడని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
మీడియా సమావేశంలో ఈ టెస్టు మ్యాచ్‌కు ఎవరు కెప్టెన్‌గా వ్యవహారిస్తారని సందీపా పాటిల్‌ను అడగ్గా ఇండియా ఏ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఛటేశ్వర పూజారానే జట్టుని ముందుండి నడిపిస్తాడని తెలిపారు. ఈ టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడడానికి గల ముఖ్య కారణం చెన్నై చెపాక్ పిచ్ మాదిరే లంకలోని పిచ్‌లు ఉండటమే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications