కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ: ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టుని ఎంపిక చేసిన పాంటింగ్

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సోమవారం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని తన దశాబ్దపు ఆల్-స్టార్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. రికీ పాంటింగ్ ప్రకటించిన తన ఆల్-స్టార్ టెస్టు జట్టులో కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు దక్కింది. అత్యధికంగా ఇంగ్లాండ్ నుంచి నలుగురు ఆటగాళ్లను పాంటింగ్ ఎంపిక చేశాడు.
పాంటింగ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న నలుగురు ఇంగ్లీషు ఆటగాళ్లు మరోవెరో కాదు బెన్ స్టోక్స్, అలెస్టర్ కుక్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్. ఇక, ఆస్ట్రేలియా నుంచి స్టీవ్ స్మిత్, నాథన్ లయాన్‌లను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్‌గా శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరకు చోటు లభించింది.
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ
"ప్రతి ఒక్కరూ ఈ దశాబ్దపు అత్యుత్తమ జట్లను ప్రకటిస్తున్నారు. నేను కూడా ఫన్‌లో భాగస్వామ్యమయ్యా. 2010 దశాబ్దానికి నేను ఎంపిక చేసిన అత్యుత్తమ జట్టిదే" అని రికీ పాంటింగ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఈ టెస్టు జట్టులో డేవిడ్ వార్నర్, అలెస్టర్ కుక్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కుమార్ సంగక్కర (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, నాథన్ లియోన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్‌లు ఉన్నారు.

ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
ఇదిలా ఉంటే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అటు టెస్టు ర్యాంకింగ్స్‌తో పాటు ఇటు వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ దశాబ్దంలో విరాట్ కోహ్లీ 27 సెంచరీలతో సహా టెస్టుల్లో 7,202 పరుగులు చేశాడు. ఇక, వన్డేల్లో 11,125 పరుగులు, టీ20ల్లో 2,633 పరుగులు చేశాడు.

విజ్డన్ జాబితాలో కూడా కోహ్లీనే
విజ్డన్ ప్రకటించిన దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు దక్కిన సంగతి తెలిసిందే. దీంతో పాటు కోహ్లీకి 2019 బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది కూడా విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఫలింతగా వరుసగా నాలుగో ఏడాది ఈ ఘనత సాధించాడు.

ఈ దశాబ్దంలో 11125 పరుగులు చేసిన కోహ్లీ
ఈ ఏడాది మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ సగటు 50పైగా నమోదైంది. ఈ దశాబ్దంలో విరాట్ కోహ్లీ 11125 పరుగులు చేశాడు. ఇందులో 42 సెంచరీలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications