Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీలో కోహ్లీ.. పట్టించుకోని అభిమానులు!!

Virat Kohli Or First Copy ?, Netizens Debate After TikTok Video Goes Viral ! || Oneindia Telugu
Virat kohli photocopy person tiktok video caught in Delhi

ఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. కేవలం బ్యాట్స్‌మన్‌ మాత్రమే కాదు మంచి కెప్టెన్ కూడా. కెరీర్ ఆరంభం నుండి పరుగుల వరద పారిస్తూ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కోహ్లీ ఆటకు మాజీలు సైతం ముగ్దులు అయ్యారు. ఇక తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు.

మాములుగా కోహ్లీ బయటకు వస్తే అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేస్తారు. సెల్ఫీ కోసం ఎగబడతారు. ఆటోగ్రాఫ్‌ కోసం క్యూ కడతారు. అయితే ఇటీవల ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌కు వచ్చిన కోహ్లీకి అలాంటివేమీ ఎదురవలేదు. ఒక్కరు కూడా సెల్ఫీ, ఆటోగ్రాఫ్‌ అడగలేదు. అదేంటీ కోహ్లీకి ఇలా జరిగిందా అనుకుంటున్నారా?. విషయంలోకి వెళితే...!! అతను కోహ్లీని పోలి ఉన్న మరో వ్యక్తి.

ఢిల్లీలో కోహ్లీని పోలి ఉన్న మరో వ్యక్తి ఆలా నడుచుకుంటూ వెళ్ళాడు. కోహ్లీ హవాభావాలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అతన్ని చూసి చాలామంది అతను కోహ్లీయేనని భ్రమపడ్డారు. కానీ.. అతను కోహ్లీ కాదని తెలుసుకుని ఒక్కరు కూడా సెల్ఫీ, ఆటోగ్రాఫ్‌ అడగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను @amit_yadav2296 అనే యూజర్‌ టిక్‌టాక్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌ అయింది. వీడియోను చూసిన వారు అతను కోహ్లీ కాదని నిర్ధారించుకుంటున్నారు.

ఈడెన్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడు రోజుల్లోనే డే/నైట్‌ టెస్టు ముగియడంతో భారత జట్టు సభ్యులు సోమవారం ముంబైకు చేరుకున్నారు. ఇక బంగ్లా సిరీస్ ముగియడంతో ఆటగాళ్లు అందరూ వారి స్వస్థలాలకు చేరుకున్నారు. ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో దిగిన కోహ్లీకి ఆయన భార్య అనుష్క శర్మ ఘనంగా స్వాగతం పలికింది. కోహ్లీ రాకకోసం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన అనుష్క భర్తను స్వయంగా రిసీవ్‌ చేసుకుంది. భర్తను చూసిన వెంటనే అనుష్క ఆనందంలో మునిగిపోయింది.

Story first published: Monday, November 25, 2019, 14:33 [IST]
Other articles published on Nov 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+