Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లి అలా అంటాడని అసలు ఊహించలేదు!- నితీశ్ రెడ్డి

భారత జట్టులో చోటు దక్కిందనే సంతోషం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి కొన్ని రోజులు కూడా లేకపోయింది. జింబాబ్వే పర్యటనకు ప్రకటించిన భారత జట్టులో తొలుత నీతీశ్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకుంటున్న నితీశ్ రెడ్డి తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మొదట అతను కేవలం బ్యాటర్ మాత్రమే అని, కానీ ఆ తర్వాత ఆల్‌రౌండర్‌గా మారానని తెలిపాడు. ఫైనల్‌లో సన్‌రైజర్స్ ఓటమి అతన్ని కలచివేసిందని చెప్పాడు. వచ్చే సీజన్‌లోనూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్‌గా కొనసాగడం అంత తేలికైన విషయం కాదని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ తీవ్ర సాధన చేయాల్సి ఉంటుందని అన్నాడు.

Virat Kohli s Personal Greeting Boosts Nitish Reddy s Confidence

అయితే కెరీర్ ఆరంభంలో కేవలం బ్యాటర్‌గా ఉన్న స్థితిలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ శైలిని తీక్షణంగా పరిశీలిస్తూ ఆటను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నించానని చెప్పాడు. కానీ ఆ తర్వాత ఆల్‌రౌండర్‌‌గా మారినప్పుడు బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్య‌ను చూసి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ట్రై చేస్తున్నట్లు నితీశ్ తెలిపాడు. విరాట్ కోహ్లి తన ఫేవరేట్ క్రికెటర్ అని నితీశ్ అన్నాడు. కోహ్లితో ప్రశంసలు దక్కించుకునేలా ప్రదర్శన చేయాలని ప్రయత్నిస్తుంటానని తెలిపాడు.

గత ఐపీఎల్ సీజన్‌లో కోహ్లితో కలిసిన సందర్భం గురించి నితీశ్ పంచుకున్నాడు. ''విరాట్ కోహ్లితో ఎక్కువగా మాట్లడలేదు. అయితే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌‌లో ఓ సంఘటన జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీపై మేం 270+ స్కోరు సాధించాం. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న టైమ్‌లో కోహ్లి నాతో ' హాయ్ నితీశ్.. ఎలా ఉన్నావ్' అని అన్నాడు. కోహ్లికి నా పేరు గుర్తుంటుందని అసలు ఊహించలేదు. ఆ టోర్నీలో అంతకుముందు కోహ్లి నా ఆట చూసి ఉండవచ్చు. కోహ్లి అలా అనడం నన్ను చాలా ఉత్తేజపరిచింది'' అని నితీశ్ పేర్కొన్నాడు.

Story first published: Saturday, July 6, 2024, 12:25 [IST]
Other articles published on Jul 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+