వైరల్ వీడియో.. కోహ్లీ 180 డిగ్రీ ల్యాండింగ్ ఎక్స్‌ర్‌సైజ్!!

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఆటగాడు. శారీరక దృఢత్వంపై అతడికి ఎనలేని నమ్మకం. జట్టు సభ్యులంతా రెండు గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ నాలుగు గంటల వరకు చేస్తాడు. ఎక్కువ సేపు జిమ్‌లో గడుపుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతడిని చూసి మిగతా భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. కోహ్లీని చూసి జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మనీష్ పాండే, మొహమ్మద్ షమీ కూడా సిక్స్ పాక్ చేసారు.

180 డిగ్రీ ల్యాండింగ్ ఎక్స్‌ర్‌సైజ:
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో గత మార్చి నుంచి ఇంటికే పరిమితమైన విరాట్ కోహ్లీ.. ప్రతిరోజు జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు. రెండు నెలలకు పైగా దొరికిన ఈ ఖాళీ సమయంలో కోహ్లీ ఫిట్‌నెస్ మరింత మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ జిమ్‌లో బరువులు ఎత్తిన కోహ్లీ.. తాజాగా తన ఇంటోనే క్లిష్టతరమైన 180 డిగ్రీ ల్యాండింగ్ ఎక్స్‌ర్‌సైజ్ చేసాడు. కాలి మడమ (కుడి)పై శరీరం బరువు మొత్తాన్ని మోపి.. ఆ తర్వాత 180 డిగ్రీ కోణంలో గాల్లోకి ఎగిరి మళ్లీ ఒంటి కాలి మడమ (ఎడమ)పై ల్యాండ్ అయ్యాడు.
విరాట్ గ్రేట్ అంటూ ప్రశంసలు:
ఈ ఎక్స్‌ర్‌సైజ్ చూడడానికి సులువుగా అనిపించినా.. ప్రాక్టికల్‌గా చేయడం మాత్రం చాలా కష్టం. సరైన ప్రాక్టీస్ లేకపోతే గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అథ్లెట్స్‌కి పాత మడమ గాయాలేమైనా ఉంటే? అవి తిరగబడే ఛాన్స్ ఉంది. అందుకే ఈ ల్యాండింగ్‌ని 'టాప్ ఎక్సర్‌సైజ్' అంటారు. ఇక్కడ కోహ్లీ మాత్రం ఈ టాప్ ఎక్సర్‌సైజ్‌ను సులువుగా చేసాడు. ఇప్పటికే కోహ్లీ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసాడో మరి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు విరాట్ గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరూ ఏ లుక్కేయండి.

క్రికెటర్లకు ప్రేరణనిచ్చేది ఫుట్‌బాలర్లే:
ఫిట్‌నెస్ పరంగా క్రికెటర్లకు ప్రేరణనిచ్చేది ఫుట్‌బాలర్లే అని విరాట్ కోహ్లీ ఇదివరకే అన్నాడు. 'మేమెప్పుడూ ఫుట్‌బాలర్ల క్రమశిక్షణను గమనిస్తుంటాం. మైదానంలోకి వెళ్లి ఆడాలంటే.. ఫిట్‌నెస్ పరంగా అత్యుత్తమంగా ఉండాలి. శారీరకంగా సన్నద్ధం అవ్వడం, పోషకాహారం, విశ్రాంతి తదితర అంశాల్లో ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారు. మేం వారి నుంచి నేర్చుకుంటాం' అని భారత కెప్టెన్ అన్నాడు. ఏ ప్రకారంగా చూసినా క్రికెటర్ల కన్నా ఫుట్‌బాలర్లు ఎక్కువ ఫిట్‌నెస్‌తో ఉంటారని కోహ్లీ చెప్పాడు.

ఫిట్‌నెస్ క్రెడిట్ శంకర్ బసూదే:
భారత క్రికెట్ జట్టును ఫిట్‌నెస్ పరంగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత శంకర్ బసూదే. కోహ్లీ, బుమ్రా వంటి క్రికెటర్లను ఫిట్‌నెస్ పరంగా కూడా టాప్‌లో నిలిపిన వ్యక్తి శంకర్ బసూ. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీస్‌లో తన పోరాటాన్ని ముగించిన తర్వాత ఫిట్‌నెస్ ట్రైనర్ శంకర్ బసూ తప్పుకున్నాడు. తన కాంట్రాక్ట్ గడువు ముగిసిపోవడంతో శంకర్ బసూ మళ్లీ అందుకు మొగ్గుచూపలేదు. 'నా ప్రస్తుత ఫిట్‌నెస్ క్రెడిట్‌ను నేను తీసుకోను. అది శంకర్ బసూదే. నా కెరీర్‌లో ఫిట్‌నెస్ పరంగా వచ్చిన అతి పెద్ద మార్పు 2015 నుంచి ప్రారంభమైంది. నా కెరీర్ మరో స్థాయికి వెళ్లడంలో శంకర్ బసూ పాత్ర మరువలేనిది' అని ఇటీవలే విరాట్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications