అసలేం జరిగింది?: కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ ఫోటో వైరల్, ట్విట్టర్‌లో ఫన్
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో ఘోర ఓటమి తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడేందుకు ప్రస్తుతం కోహ్లీసేన వెస్టిండిస్‌లో పర్యటిస్తోంది. ఈ సిరిస్‌లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
38 ఓవర్ల వరకు మ్యాచ్ బాగానే జరిగింది. 38వ ఓవర్ ముగిసిన తర్వాత వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గాక మళ్లీ ఆట మొదలైనా.. 40వ ఓవర్‌లో మళ్లీ ఆగిపోయింది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి టీమిండియా 39.2 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఓ కిటికీలో నుంచి సరదాగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి చూసే ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ పెట్టారు. అనిల్ కుంబ్లే వస్తున్నాడు టీవీ ఆఫ్ చేయండని ఒకరంటే.. అంకుల్ మా బాల్ లోపల పడింది ఇస్తారా? అని మరొకరు.. ఈ ఫోటోపై రకరకాల కామెంట్స్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications