For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిజమైన హీరోలు వారే.. అమరవీరులకు తలవంచి వందనం చేస్తున్నా: కోహ్లీ

Virat Kohli Pays Tributes To Security Personnel Killed In Action In Handwara Encounter

ఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు అమరవీరులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నివాళులర్పించాడు. అత్యంత సంక్లిష్ట సమయంలో పనిచేస్తూ.. ప్రాణత్యాగం చేసిన వీరులను జాతి మరవదని పేర్కొన్నాడు. జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం 16 గంటల పాటు భీకర ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే.

'క్లిష్ట పరిస్థితుల్లోనూ విధులను మర్చిపోని వారే నిజమైన హీరోలు. వారి త్యాగం మర్చిపోవద్దు. హంద్వారాలో అమరులైన సైనికులు, పోలీసులకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. జైహింద్‌' అంటూ విరాట్‌ కోహ్లీ ఆ ఐదుగురు అమర జవాన్ల ఫొటోలతో ఓ ట్వీట్ చేశాడు.

జ‌మ్మూకాశ్మీర్‌లోని హంద్వారాలో తీవ్ర‌వాదులు కాల్పుల‌తో రెచ్చిపోయారు. అయితే 16 గంటల పాటు సాగిన భీకర ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలకు తీవ్ర ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఎదురుకాల్పుల్లో సైన్యానికి చెందిన ఒక కర్నల్‌, ఒక మేజర్‌, ఇద్దరు సైనికులు, జమ్మూ-కశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందిన ఒక ఎస్సై మరణించారు. ఘటనాస్థలిలో చిక్కుకుపోయిన పౌరులను రక్షించే క్రమంలో వీరు వీరమరణం పొందారు. ఇద్దరు ఉగ్రవాదులను సైనిక కమాండోలు మట్టుబెట్టారు. శనివారం సాయంత్రం 3 గంటలకు ఈ ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది.

కరోనా వైరస్​పై యుద్ధం చేసేందుకు, లాక్​డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు నిర్వహిస్తున్న ఆన్​లైన్ సంగీత విభావరిలో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వాములు కానున్నారు. 'ఐ ఫర్ ఇండియా' చేపడుతున్న ఈ కార్యక్రమంలో నటులు, సంగీత దర్శకులు, గాయకులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు పాల్గొని.. తమ ఇంటి దగ్గరి నుంచే ప్రజలను ఎంటర్​టైన్ చేయనున్నారు. దీని ద్వారా నిధులను సమీకరించనున్నారు.

కరోనాపై పోరు కోసం పీఎం-కేర్స్‌ ఫండ్, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి కోసం విరుష్క జోడి నిధులు అందించనున్నట్లు గతంలోనే ప్రకటించైనా విషయం తెలిసిందే. అయితే తాము ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నది మాత్రం వారిద్దరు గోప్యంగా ఉంచారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరు రూ. 3 కోట్లు విరాళం ఇచ్చారని తెలిసింది.

Story first published: Monday, May 4, 2020, 21:43 [IST]
Other articles published on May 4, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+