Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: రాత్రి అంతా పార్టీ చేసుకొని.. తర్వాతి రోజు డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ!

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ప్లేయర్ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తన కెరీర్ పీక్స్‌లోకి వెళ్తున్న సమయంలో ఫిట్‌నెస్ ప్రాముఖ్యత తెలుసుకున్న అతను.. లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసుకున్నాడు. డైట్ కూడా మార్చేసుకొని, వెజిటేరియన్‌గా మారిపోయాడు. ఇదే విషయాన్ని అతని టీంమేట్ ఇషాంత్ శర్మ గుర్తుచేసుకున్నాడు.

తన ఫిట్‌నెస్ స్టాండర్డ్స్‌తో భారత జట్టులో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన కోహ్లీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన టీంమేట్స్‌ కూడా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేలా కోహ్లీ చర్యలు తీసుకున్నట్లు చెప్పాడు. దీంతో టీమిండియా బెస్ట్ టీంగా మారిందని ఇషాంత్ చెప్పాడు. 'కోహ్లీ చాలా మారిపోయాడు. తను ఈ ఫేజ్‌లో ఉండటం నేను చూశా. అలాగే టాటూ ఫేజ్‌లో ఉండటం కూడా చూశా' అని ఇషాంత్ చెప్పాడు.

 Virat Kohli partied all night but scored double century next morning

'మేం కోల్‌కతాలో అండర్-19 మ్యాచ్ ఆడుతున్నాం. ఆ రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ నాటౌట్‌గా ఉన్నాడు. తర్వాతి రోజు తను మళ్లీ బ్యాటింగ్ చేయాలి. కానీ ఆరోజు నైట్ అంతా పార్టీ చేసుకున్నాడు. ఆ తెల్లారి 250 పరుగులు చేశాడు. నేను కోహ్లీ ఆ ఫేజ్ కూడా చాలా దగ్గర నుంచి చూశా. కానీ అతనిలో బెస్ట్ విషయం ఏంటని అడిగితే మాత్రం.. 2012 తర్వాత శారీరకంగా కోహ్లీ మారిన తీరు అని చెప్తా' అని ఇషాంగ్ వివరించాడు.

'వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ ట్రైనింగ్ మొదలు పెట్టాడు. తన మెంటల్ స్ట్రెంగ్త్ కూడా వేరే లెవెల్‌కు చేరుకుంది. అలాగే తన ఫేవరెట్ ఫుడ్ అయిన ఛోలే బతూరే కూడా తినడం తగ్గించేశాడు. మామూలుగానే ఢిల్లీ వాళ్లు ఎక్కువ తినడం ఇష్టపడతారు. కానీ 2012 నుంచి ఇప్పటి వరకు కోహ్లీ ఛోలే బతూరే తినడం కేవలం ఒకటి, రెండు సార్లే చూశా. అంత స్ట్రిక్ట్‌గా ఉంటాడు కోహ్లీ' అని పేర్కొన్నాడు.

Story first published: Monday, June 26, 2023, 9:38 [IST]
Other articles published on Jun 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+