Asia Cup 2022 : హుషారవ్వు తొందరగా అంటూ షాహీన్ అఫ్రిదిని పరామర్శించిన కోహ్లీ, పంత్ ఇతర భారత స్టార్లు

ఆదివారం ఆసియా కప్‌లో క్రికెట్ వార్ జరగబోతుంది. ఆ వారే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం కోసం ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆసియాకప్ టోర్నీ కోసం జట్లన్నీ దుబాయ్ చేరుకున్నాయి. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో శిక్షణ సెషన్‌లలో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకరినొకరు కలుసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విరాట్ కోహ్లీ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తొలి రోజు కలిసి ఒకరినొకరు గ్రీటింగ్స్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ స్టార్ లెఫ్టార్మ్ పేసర్ షాహీన్ అఫ్రిదిని కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్ పరామర్శించారు. గాయంతో ఆసియాకప్ టోర్నీకి దూరమైన అఫ్రిది.. ట్రైనింగ్ సెషన్ వద్ద జట్టుతో పాటే ఉన్నాడు. అతను గాయంతో మోకాలి బ్రేస్ ధరించి కనిపించాడు. స్పీడీ రికవరీ కోసం అతనికి భారత స్టార్లు పరామర్శలు తెలిపారు.
షాహీన్ నీ బ్యాటింగ్ మిస్సవుతున్నాం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఈ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో షాహీన్ అఫ్రిదితో భారత ప్లేయర్లు ముచ్చటించిన విజువల్స్ కన్పించాయి. షాహీన్ అఫ్రిది.. విరాట్ కోహ్లీతో చాలా సేపు మాట్లాడడం చూడ్డానికి బాగుంది. ఇక సంభాషణ ముగింపులో పాకిస్థాన్ పేసర్ త్వరగా కోలుకోవాలని కోహ్లీ విష్ చేశాడు. పాకిస్థాన్ తరఫున నీ బ్యాటింగ్ మిస్సవుతున్నాం షాహీన్ అంటూ రిషబ్ పంత్ సరదాగా అఫ్రిదితో అనడంతో ఇద్దరు నవ్వుకున్నారు. ఇక అఫ్రిది స్పెషలిస్టు పేసర్ మాత్రమే అనే సంగతి తెలిసిందే.

నెటిజన్ల ప్రశంసలు
అలాగే భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను కూడా అఫ్రిది కలిశాడు. ఈ నెల ప్రారంభంలో జింబాబ్వేలో జరిగిన 3మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాహుల్ భారత్‌కు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇకపోతే కేఎల్ రాహుల్ ఐపీఎల్ తర్వాతర భారత్ తరఫున ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అఫ్రిదిని పరామర్శించిన రాహుల్.. హుషారవుతావు అంటూ ఉత్సాహపరిచాడు. ఇకపోతే అఫ్రిదీ భారత ఆటగాళ్లతో సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. స్టార్ క్రికెటర్ల మధ్య పరస్పర గౌరవ పూర్వకం సంభాషణలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇకపోతే గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో భారత టాపార్డర్‌ను షాహీన్ అఫ్రిది కుప్పకూల్చడం, తర్వాత బాబర్ ఆజామ్, రిజ్వాన్ చెలరేగడంతో భారత్‌పై పాక్ 10వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఇటు బుమ్రా.. అటు షాహీన్ అఫ్రిది
ఇకపోతే టీమిండియా ఆసియాకప్‌లో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుండడం అభిమానులకు క్రికెట్ పండగల ఉంది. ఈసారి రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగబోతుంది. ఇక ఈ మ్యాచ్‌కు భారత స్టార్ బౌలర్ బుమ్రా, పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది దూరమవ్వడంతో బౌలింగ్ ఎటాక్‌ను భారత్ తరఫున భువీ లీడ్ చేయనుండగా.. పాక్ బౌలింగ్ ఎటాక్‌ను హరీస్ రౌఫ్ లీడ్ చేయనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications