రెస్ట్ కోసమని ఇంటికెళ్లి... అనుష్కను చూసి భయపడ్డా: కోహ్లీ

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం విరాట్ కోహ్లీ వెన్ను కారణంతో విరామం తీసుకున్నాడు. ఇందులో భాగంగా కుటుంబంతో కలిసి తన సతీమణి నటించిన పరీ సినిమా
చూశాడట. సినిమాలో అనుష్క పర్ఫామెన్స్ చూసి తానే భయపడిపోయినట్లు ట్వీట్ చేశాడు.
తనదైన స్టెల్‍లో రాసిన రివ్యూకి కోహ్లీ, అనుష్క ఇద్దరి అభిమానులు క్షణాల్లోనే స్పందించారు. ఆ ట్వీట్ లో కోహ్లీ.. పరీ సినిమా చూశాను. నా భార్య బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో ఇది బెస్ట్ మూవీ. చాలా భయపడ్డాను.. కానీ అనుష్కను చూసి గర్వంగా ఉందంటూ.. భార్యపై తెగ ప్రశంసలు కురిపించాడు.
దీనికి అనుష్క కూడా రియాక్టయింది. కామెంట్‌లో ఆమె ఓ స్మైలీని పోస్ట్ చేసింది. కోహ్లి చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. నిమిషాల్లోనే వెయ్యికిపైగా రీట్వీట్స్ చేశారు. అనుష్క శర్మ తల్లిదండ్రులతో కలిసి విరాట్ ఈ మూవీ చూశాడు.
సినిమా రిలీజ్‌కు ముందు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ఉందని విరాట్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా.. చాలామంది అనుష్క పర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications