స్మిత్, కోహ్లీలో ఎవరు బెస్ట్?.. సచిన్ ఏమన్నాడంటే?!!

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇద్దరిలో మేటి బ్యాట్స్‌మన్ ఎవరు? ఈ అంశంపై చాలాకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. జనవరిలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఇద్దరిలో మేటి బ్యాట్స్‌మన్ ఎవరన్న చర్చ తెరమీదకు వచ్చింది. కోహ్లీనే అన్ని ఫార్మాట్లలో బాగా రాణిస్తాడని, స్మిత్ టెస్టుల్లో ఆకట్టుకోలేడని చాలా మంది మాజీలు చెప్పారు. తాజాగా ఈ చర్చ మళ్లీ వచ్చింది.

కోచ్‌గా సచిన్:
ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్ధం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తలపెట్టిన 'బుష్‌ఫైర్ క్రికెట్ బాష్' చారిటీ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ లెవెన్‌కు భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ కోచ్‌గా వ్యవహరించనుండగా.. మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ లెవెన్ జట్టుకు వెస్టిండీస్ మాజీ పేసర్ కోట్నీ వాల్ష్ కోచ్‌గా ఉన్నారు. సచిన్ ప్రస్తుతం సిడ్నీలో ఉన్నాడు. చారిటీ మ్యాచ్ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించాడు.

పోలిక నచ్చదు:
కోహ్లీ, స్మిత్‌లో ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్ అనే ప్రశ్నకి సచిన్ అద్భుతమైన సమాధానమిచ్చాడు. 'కోహ్లీ, స్మిత్ విషయంలో మనం పోలికలు చూడొద్దు. ఇద్దరు ఎలా ఆడుతున్నారో దాన్ని ఆస్వాదిద్దాం. తమ ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం అలరిస్తున్నారు. వారి ఆటతో మనకు సంతోషాన్ని అందిస్తున్నారు' అని సచిన్ చెప్పాడు. 'సహజంగా నాకు ఒక ఆటగాడితో మరొకరిని పోల్చడం నచ్చదు. నేను ఆడే రోజుల్లో కూడా ఇతర ఆటగాళ్లతో పోల్చేవారు. నన్ను.. బ్రయన్ లారా, రికీ పాంటింగ్, డాన్ బ్రాడ్‌మన్, సునీల్ గావస్కర్‌లతో పోల్చేవారు' అని సచిన్ తెలిపాడు.

లబుషేన్‌పై ప్రశంసల జల్లు:
ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మార్నస్ లబుషేన్‌పై సచిన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత తరం క్రికెట్‌ర్లలో ఎవరైనా మిమ్మల్ని మీకు గుర్తు చేశారా? అని సచిన్‌ను ప్రశ్నించగా.. మార్నలస్ లుబుషేన్‌లో ఒకప్పటి తనను చూసుకున్నానని తెలిపాడు. అతని ఫుట్ వర్క్ అద్బుతంగా ఉంటుందని, అచ్చం తనాలే ఉందన్నాడు. అందుకే లబుషేన్ తనని గుర్తు చేశాడంటున్నాని మాస్టర్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీకే నా ఓటు అన్న వాగన్:
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మైఖేల్ వాగన్ మాత్రం తన ఓటు విరాట్ కోహ్లీకే అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లలో విరాట్ కోహ్లీయే మేటి అంటూ వాగన్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ కంటే స్టీవ్ స్మిత్ మేటి ఆటగాడన్న అభిప్రాయంతో వాగన్ విభేదించారు. లెజెండరీ ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ తనను గనక ఎంపిక చెయ్యమంటే.. స్మిత్‌కి కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని తన ఫేవరెట్ మాత్రం కోహ్లీ అని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications